
ఇప్పుడిప్పుడే వరద విపత్తు నుంచి బయటపడుతున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్ర మౌలిక వసతుల మీద ద్రుష్టి కేంద్రికరించింది. ఇందులో భాగంగా ముందుగా రోడ్ల నిర్మాణానికి నడుం బిగించింది కూటమి ప్రభుత్వం.
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు, ఆయా శాఖ ప్రభుత్వ యంత్రాగాన్ని తగిన ఆదేశాలు జారీ చేసారు. రానున్న రెండు నెలల కాలవ్యవధిలో రాష్ట్రంలో ఎక్కడా రోడ్ల మీద గుంతలు కనిపించకూడదని ఆదేశాలిచ్చారు .
అలాగే వాటిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన కార్యచరణను సిద్ధం చేసి వాటి అమలుకు అందరు సంసిద్ధం కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఆదేశాల పై నిర్లక్ష్యం వహించిన అధికారుల పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్అండ్బీ శాఖ మీద ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తో సచివాలయంలో సమీక్షలు నిర్వహించిన బాబు రోడ్ల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రోడ్లన్నీ దీనావస్థకు వచ్చాయని, దానికి తోడు ఇటు వర్షాలు, అటు వరదలతో మరికొన్ని రోడ్లు అద్వానంగా మారాయన్నారు.
దినీతో రాష్ట్రంలో ఎక్కడ చూసిన గుంతలు పడ్డ రోడ్డులే దర్శనమిస్తున్నాయి. వెంటనే ఈ పరిస్థితులు మారాలి. డ్రోన్ల సాయంతో దెబ్బ తిన్న రోడ్లను సర్వే చేసి ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో రహదారుల ఆధునీకరణకు కార్యాచరణ రూపొందించాలంటూ ఆదేశాలు ఇచ్చారు బాబు.
దాదాపు 7087 కి.మీ. మేర గుంతలు పడ్డ రోడ్ల మరమ్మత్తులకు 290 కోట్లు, అలాగే వరదలు, వర్షాలతో దెబ్బ తిన్న 4565 కి.మీ పునరుద్దరణకు 186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుండి విడుదల చేయాలనీ ప్రభుత్వం ఆదేశించింది.
దీనితో గత ఐదేళ్ల నరకయాతనకు ఎండ్ కార్డు పడబోతోంది అంటూ వాహనదారులతో పాటు పాదచారులు ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎన్నడూ రోడ్ల మీద ద్రుష్టి పెట్టింది లేనే లేదు. సమీక్షలు నిర్వహించిందే కానరాలేదు అంటూ బాబు నిర్ణయం పై హర్షం వ్యక్తం అవుతుంది.
అలాగే కూడా ఈ విషయంలో ప్రభుత్వం చాల సీరియస్ గా వ్యవహరిస్తుందని, అధికారుల నుండి ఎటువంటి అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని, కాదూకూడదని ఎవరైనా తమకు కేటయించిన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పాత చంద్రబాబు ని చూస్తారంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
గత పాలకుల తప్పుల మీద ఆరోపణలు చేస్తూ కాలయాపన చెయ్యకుండా ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాలకోసం వెచ్చిస్తూ ఏపీ ప్రభుత్వం మొత్తానికి రోడ్ల సమస్య తీర్చడానికి రోడ్డెక్కింది.
Aadi Saikumar is gearing up for a new film with Trishul Entertainments, which has announced…
Cricketer Prithvi Shaw and actor Akriti Agarwal are back together just weeks after calling off…