
తాజా పరిణామాలను బట్టి చూస్తే ప్రస్తుత కేబినెట్ నుంచి నలుగురైదుగురికి ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. దీంతో పది మంది కొత్త వారికి ఛాన్స్ లభించే అవకాశం వుందని, ఆ జాబితాలో ముందు వరుసలో నారా లోకేష్, భూమా అఖిలప్రియలు ఉన్నారని, వీరిద్దరికీ ఖచ్చితంగా మంత్రి పదవులు ఖాయమయ్యాయని సమాచారం. అలాగే ముస్లిం మైనారిటీ నుంచి ఎంఏ షరీఫ్, జలీల్ ఖాన్, చాంద్ బాషాలలో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చని సమాచారం. పార్టీ సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులకు కూడా మంత్రి పదవి వరించే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి.
ఆరోగ్యం దెబ్బతినడం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఓ సీనియర్ మంత్రికి ఉద్వాసన తప్పకపోవచ్చని, అలాగే చురుగ్గా ఉన్నప్పటికీ తన శాఖపై పట్టు సాధించలేకపోయిన మరో మంత్రి పైనా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఆశావహుల జాబితా అయితే కళావెంకట్రావు, సుజయ రంగారావు, గౌతు శివాజీ, ఎంవీవీఎస్ మూర్తి, బండారు సత్యనారాయణ, అనిత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, ధూళిపాళ నరేంద్ర… ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా చాలా పెద్దదే!
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…