
ప్రజలు అడక్కుండానే మా అధినేత మాతో సిమెంట్ రోడ్లు వేయించారు. ఒకవేళ ప్రజలు కావాలని అడిగి మొత్తుకుంటే, మేము చేసిన పనికి ప్రజల్లోకి బాగా వెళ్లి ఉండేదని అన్నారు. రాష్ట్ర విభజనతో కళావిహీనంగా మారిన రాష్ట్రాన్ని చక్కగా అలికి ముగ్గులు వేయాలని చంద్రబాబు భావించారు. అందుకే దాదాపుగా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డులు తారసపడతాయి.
కానీ ప్రజలకేమో అది మేము దోచుకున్నట్లుగా అర్ధమయ్యింది. రోడ్లు వేసేది ప్రజల కోసం కాదు, నేతల కమిషన్ కోసం అన్నట్లుగా భావించారు. అడక్కుండానే రోడ్లు వేస్తే ప్రజలు అలా అనుకుంటారని తాము ఆనాడు ఊహించలేకపోయామని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే “ప్రజలు అడగకుండా రోడ్లు వేయడం అనేది మాదే తప్పు కదా, మాకు, మా పార్టీ అధినేతలు అదే పెద్ద శిక్ష అయిపోయింది” అంటూ మనసులోని ఆవేదనను బయటపెట్టారు.
ఇంకొక విషయం ఏమిటంటే వేసిన ఆ రోడ్ల తాలూకు డబ్బులు ఇంతవరకు రాలేదు. ఇంకా 75 శాతం పైగా రావాల్సిన డబ్బు పెండింగ్ లో ఉంది. పాలకుడు మంచివాడు అయితే పర్లేదు గానీ, పాలకుడు అనేవాడు దుర్మార్గుడు అయితే వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడి, అనేక మంది నాయకులు, కార్యకర్తలు సొంత ఆస్తులు అమ్మి బకాయిలు కట్టారని చెప్పారు.
ఆనాడు కాంట్రాక్టర్ మార్జిన్ లేకుండా ఎస్టిమేషన్ తయారు చేయమని చంద్రబాబు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికైనా వెళ్లి చెక్ చేసుకోండి, ఏ పేపర్ మీద అయినా సరే, కాంట్రాక్టు మార్జిన్ లేకుండా రూపొందించారు. మా నాయకుడు చెప్పాడని, మా ఎమ్మెల్యే చెప్పాడని, మా మంత్రి చెప్పాడని మాకు మంచి పేరొస్తుందని ఒంటి మీద బట్టలు ఊడిపోయే దాకా చేసారు.
దీని వలన మా పార్టీ నాయకులను ఆర్ధికంగా దెబ్బ తీయడానికి ఈ ప్రభుత్వం ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. క్రిమినల్ పార్టీ – క్రిమినల్ ఆలోచనలు కదా… అందుకే అలాంటి నష్టం జరిగిందని అన్నారు. మన ఊర్లను బాగుచేద్దాం, గ్రామాలను బాగుచేద్దాం అన్న ఆలోచనతోనే చాలా డంపింగ్ యార్డులు కట్టాం, బరేలీ గ్రౌండ్ లు బాగుచేసాం, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గ్రామ పంచాయితీలలో ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
Ravichandran Ashwin believes India's decision to pick Naman Dhir over Tamil Nadu Star Washington Sundar…
Ram Pothineni is taking on two roles for his neo-noir psychological action thriller #RAPO23. Marking…