
Chandrababu Naidu vs YS Jagan Projects
రాష్ట్ర విభజనతో తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు ఖాళీ ఖజానా మిగిలింది. అలాంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన నుంచి ఏమీ ఆశించలేము.
కానీ ఆయన ఎంత వేగంగా సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపట్టారో అందరూ చూశారు. నాడు, నేడు అయన అభివృద్ధి మంత్రం పటిస్తూనే ఉన్నారు.
అయితే చంద్రబాబు నాయుడి ప్రతీ ఆలోచనని, నిర్ణయాన్ని, చేసే ప్రతీ పనిని విమర్శిస్తుంటారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
తాను సిఎంగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలు, ‘గ్రీన్ మ్యాట్ ఫోటోలు’ తీసుకునేవారు. భవిష్యత్‌లో చంద్రబాబు నాయుడు వాటిని పూర్తి చేస్తే, ఆ పనులన్నీ నేనే చేయించానని చెప్పుకునేందుకు, వాటి క్రెడిట్ తీసుకునేందుకే చాలా ముందు చూపుతో ‘గ్రీన్ మ్యాట్ ఫోటోలు’ తీసుకునేవారేమో? అని ఇప్పుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మొన్న భోగాపురం విమానాశ్రయం, నిన్న వెలిగొండ, రేపు పోలవరం నుంచి ఉత్తరాంద్ర జిల్లాలకు గోదావరి నీటి విడుదల అన్నిటికీ ఫోటోలు, వీడియోలు సిద్ధంగా ఉన్నాయి. కనుక వాటిని చూపి క్రెడిట్ తీసుకుంటూనే ఉంటారు. ఇంత ముందు చూపు రాష్ట్రాభివృద్ధిలో చూపి ఉంటే ఆ ఫోటోలు, వీడియోలు చూపుకుంటూ క్రెడిట్ కోసం అర్రులు చాచాల్సిన అవసరం ఉండేది కాదు కదా?
స్వయంగా అన్ని పనులు అప్పుడే పూర్తిచేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటే, ఆ క్రెడిట్ ఆయనకే దక్కేది కదా? కానీ ఎందుకు చేయలేదు?
సంక్షేమ పధకాల యావలో పది రాష్ట్రంలో రోడ్ల గుంతలు పూడ్చేందుకే జగన్ ప్రభుత్వం నిధులు కేయించనప్పుడు, సాగునీటి ప్రాజెక్టుల కోసం వందలు వేలకోట్లు ఎలా కేటాయించగలదు?
అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని కాదని, ప్రజలు తనని అంత భారీ మెజార్టీతో అధికారం ఎందుకు కట్టబెట్టారు?వారి ప్రేమకు, నమ్మకానికి కారణం ఏమిటి? అని జగన్ ఆలోచించి ఉంటే ఆయన పాలన వేరే విధంగా ఉండేది. కనీసం చేతులు కాలిన తర్వాత అయినా ఆకులు పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు.
ఈ వయసులో సిఎం చంద్రబాబు నాయుడు క్వాంటం ఆలోచనలు చేస్తుంటే, యువకుడినని గర్వంగా చెప్పుకునే జగన్‌కి ఆయనని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తాను చేయలేకపోయిన అభివృద్ధి పనులు అయన చేసి చూపిస్తుంటే, కనీసం వాటిని చూసైనా తాను ఏమేమి చేసి ఉండాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా?
కానీ ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేకుండా సిఎం చంద్రబాబు నాయుడుని, అభివృద్ధి పనులను విమర్శిస్తూనే, మళ్ళీ వాటి క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు. రాజకీయాలలో ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…
Mythological subjects have managed to leave an impression on the audience over the last few…