
“దగ్గరకొచ్చేయ్… దగ్గరకొచ్చేయ్… దగ్గరకొచ్చేయ్…. నీకు 15 వేలు… నీకో 15వేలు… నీక్కూడా ఓ 15వేలు…” అంటూ జగన్ కామెడీ చేస్తుంటే సిఎం చంద్రబాబు నాయుడు కనీసం చిర్నవ్వు నవ్వలేదు. జగన్ మీద లడ్డూ బాంబు వేశారు! దాంతో ఇప్పుడు జగన్‌కి నోట మాట రాక తడబడుతున్నారు. ఇంక కామెడీ ఏం చేస్తారు?
ఎన్నికలలో వైసీపి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వెంటనే తనని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారని జగన్ అనుకుని ఉంటారు. బహుశః అందుకే చాలా రోజులు ప్యాలస్‌లో నుంచి కాలు బయట పెట్టలేదు.
అయితే చంద్రబాబు నాయుడు తనని ఏమీ చేయకపోవడంతో, ఇక ఏమీ చేయరని, ఏమీ చేయలేరని గట్టి నమ్మకం ఏర్పడిన్నట్లుంది.
అందుకే విజయవాడ వరదలలో జగన్ విలన్ పాత్ర ట్రై చేశారు. అయినా చంద్రబాబు నాయుడు ఏమీ అనకపోవడంతో ఆ తర్వాత ‘దగ్గరకొచ్చేయ్…’ అంటూ కామెడీ సీన్స్ కూడా ట్రై చేశారు.
నిజానికి చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ముఖ్యమంత్రి అయిన మరుక్షణం జగన్‌ని జైల్లో వేయగలరు. కానీ అది చంద్రబాబు నాయుడు పద్దతి కానే కాదు. జగన్‌ని జైలుకి పంపిస్తే అతనికే సానుభూతి పెరుగుతుందని తెలుసు.
కనుక జగన్ విమర్శలను, సొంత పార్టీ నేతలు, కార్యకర్తల అసహనాన్ని మౌనంగా భరిస్తూనే చడీ చప్పుడూ లేకుండా పూర్తి సాక్ష్యాధారాలతో లడ్డూ బాంబు పేల్చేసరికి జగన్‌కి గొంతు తడారిపోయి ఉంటుంది.
జగన్‌కే కాదు పక్క రాష్ట్రంలో నా అంతటి మేధావి లేడనుకున్న కేసీఆర్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు శక్తియుక్తులు అర్దమయ్యే ఉంటాయి. బహుశః అందుకే బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌తో సహా అందరూ ‘సైలంట్ మోడ్’లో ఉన్నారేమో?
ఇదివరకు జగన్ పక్కన సజ్జల రామకృష్ణా రెడ్డి ఉండేవారు. కనుక ఇలాంటి సమయంలో ఆయనని మీడియా ముందుకు పంపించి తాను సేవ్ అవుతుండేవారు. కానీ ఆయనని మెడ పట్టుకొని బయటకు గెంటేయడంతో ఇప్పుడు జగన్ తనకు అలవాటులేని ప్రెస్‌మీట్‌లో పాల్గొని ఏదేదో మాట్లాడి నవ్వుల పాలయ్యారు.
అంతేకాదు… చంద్రబాబు నాయుడు ప్రయోగించిన ఈ తీయటి అస్త్రంతో జగన్ యావత్ దేశ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది.
ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండేది కానీ అదే మోడీ ప్రభుత్వం టిడిపితో పొత్తులు కుదిరిన తర్వాత వేరేగా ప్రవర్తిస్తోందని జగన్ గుర్తించారు. కానీ మూడు నెలల్లోనే మరిచిపోయారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుండటంతో ఎవరికి మొర పెట్టుకోవాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలీని పరిస్థితి నెలకొంది.
జగన్ ఇంతకాలంగా రాజకీయాలలో ఉన్నారు కానీ ఎక్కడ నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో తెలుసుకోలేకపోయారనే చెప్పవచ్చు. తన బలాబలాలు ఏమిటో, ప్రత్యర్ధుల బలాబలాలు ఏమిటో తెలుసుకోలేకపోవడం వలననే ఈవిదంగా ఎదురు దెబ్బలు కూడా తింటున్నారు.
ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే… మున్ముందు ఇటువంటి బాణాలు, బాంబులు ఇంకా చాలా పడతాయి. కానీ ఎప్పుడు ఏది పడుతుందో తెలీని పరిస్థితి. కనుక ఇప్పటికైనా చుట్టూ ఏర్పాటు చేసుకున్నా చిడత భజన బ్యాచ్‌ని వదిలించుకొని, తాను తప్పుచేయకుండా ఆపగలిగేవారిని, ఒకవేళ చేస్తుంటే ధైర్యంగా చెప్పగలిగేవారిని పెట్టుకొని తూచా తప్పకుండా వారి సలహాలు పాటిస్తే కనీసం కష్టాల తీవ్రత తగ్గించుకోగలుగుతారు!
Vijay Deverakonda and Rashmika Mandanna's upcoming film Ranabaali has cleared the censor process ahead of…
Akshay Kumar’s upcoming sci-fi thriller Samuk is assembling an intriguing ensemble. But the casting of…