Telugu

ప్రజలు, ప్రత్యర్ధులను భయపెట్టి అధికారంలోకి.. సాధ్యమేనా?

గతంలో ప్రభుత్వాలు, పోలీసులు మావోయిస్టులను అడవులు, తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ‘మెయిన్ స్ట్రీం రాజకీయాలలోకి’ రావాలని పిలుపునిచ్చారు.

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “చొక్కా మడత పెట్టా.. 2.0లో అందరిని అంతు చూస్తానంటూ జగన్‌ మాట్లాడిన మాటలు ఓ రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనా? ఇదివరకు ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే ఏం చేశారో అందరూ చూశారు. ఈసారి అప్పగిస్తే అందరినీ లేపెస్తాం.. అంటూ బెదిరిస్తున్నారు.

ADVERTISEMENT

జగన్‌ నెక్స్ట్ లెవెల్ ఇదేనన్న మాట! అధికారులను, ప్రత్యర్ధులను పదేపదే బెదిరించడం, భౌతిక దాడులు, హత్యలను ప్రోత్సహించే రాజకీయాలు మానుకొని, పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలతో సాధారణ రాజకీయాలు చేస్తే బాగుంటుంది.

ఇలాంటి బెదిరింపులకు ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరు. ఇలాగే వ్యవహరించినందుకే ప్రజలు దించేశారు. కనుక జగన్‌ ఇకనైన తన తీరు, రాజకీయాలు చేసే విధానాలు మార్చుకొని ‘మెయిన్ స్ట్రీం రాజకీయాలలోకి’ రావాలని కోరుతున్నాను,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

రాజకీయాలలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవంటారు. ప్రజలు చంద్రబాబు నాయుడుని కాదని తిరుగులేని మెజార్టీతో జగన్‌ని గెలిపిస్తే, ఐదేళ్ళకే అత్యంత అవమానకరంగా ఓటమి పాలవడం రాజకీయ ఆత్మహత్యే కదా?

అయినా ఎందువల్ల ఓడిపోయాము? ప్రజలు ఎందుకు తిరస్కరించారు?అని ఆలోచించి ఉంటే నేడు చంద్రబాబు నాయుడుతో ఈవిధంగా చెప్పించుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు కదా?

కానీ నేటికీ చొక్కా మడత పెట్టా.. నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రినవుతా.. అందరి తాట తీస్తానని బెదిరిస్తుంటే, ప్రజలు భయపడకుండా ఉంటారా?మళ్ళీ గెలిపిస్తారా?అని జగన్‌ ఆలోచిస్తే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

M9 Exclusive: Vijay as Sukumar’s Second Choice for RC17?

Sukumar is making strong efforts to bring a celebrated Tamil hero on board Ram Charan’s…

24 minutes ago

Tollywood BO: Worst Situation This Weekend?

We have two notable Telugu films arriving at the ticket counters this weekend, and they…

54 minutes ago