చంద్రబాబు అంటే చకచకా అభివృద్ది

సిఎం చంద్రబాబు నాయుడు అంటే చురుకైన పాలన, అభివృద్ధి, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, మౌలిక వసతుల కల్పనకు మారుపేరని అందరికీ తెలిసిందే.

ADVERTISEMENT

ఐదేళ్ళ జగన్‌ విధ్వంస పాలనతో అన్ని రంగాలలో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ‘అభివృద్ధి’ అనే మాట మళ్ళీ వినపడుతోంది.

బీడువారిన భూమిలో వర్షపు చుక్కలు పడి పుడమి తల్లి పులకరించిన్నట్లుగానే గత 5 ఏళ్ళుగా అభివృద్ధి అనే పదం వినేందుకు పరితపించిన ఆంధ్రా ప్రజలు ఇప్పుడు సంతోషించాల్సిన సమయం వచ్చేసింది.

ఈ ఏడాది అక్టోబర్‌లో అమరావతికి ప్రపంచ బ్యాంక్ రూ.15,000 కోట్లు అందించబోతోంది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.30,436.95 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదటి విడతలో రూ.6,000 కోట్లు, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.6,157 కోట్లు విడుదల చేస్తుంది.

పోలవరం తొలిదశ ఏనులను 2027లోగా పూర్తి చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని కోసం సమర్దులైన ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేయబోతోంది. వీటి కోసం రూ.28,602 కోట్లు ఖర్చు చేయబోతోంది. వాటిలో మూడు కారిడర్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించింది.

వాటిలో విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా కడప జిల్లా కొప్పర్తి వద్ద ఒకటి, బెంగళూరు-హైదరాబాద్‌ కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఒకటి, బెంగళూరు-చెన్నై కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నంలో మరొకటి ఏర్పాటు చేసేందుకు నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.

వాటిలో బెంగళూరు-చెన్నై కారిడార్‌లో భాగంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 11,096 ఎకరాలలో కృష్ణ పట్నం సిటీ (క్రిస్ సిటీ) నిర్మించబోతున్నాయి.

క్రిస్ సిటీని మూడు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో 2,134 ఎకరాలలో రూ.1,054.60 కోట్లతో మౌలిక వసతులకు ఖర్చు చేస్తారు. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.

దీనిలో సెమీ కండక్టర్లు. ఎలక్ట్రానిక్ తదితర పరిశ్రమలు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా సుమారు 88,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి.

ఇక క్రిస్ సిటీ నిర్మాణానికి ఇప్పటికీ జాకబ్స్ ఇంజన్నీరింగ్ గ్రూప్ అనే సంస్థ మాస్టర్ ప్లాన్ తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీనికి సెప్టెంబర్‌ మొదటి వారంలో లేదా టిడిపి కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయినప్పుడు అంటే సెప్టెంబర్‌ 20వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ చేసే అవకాశం ఉంది.

ఇది గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా క్రిస్ సిటీ… దానిలో పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి కనుక పచ్చటి చెట్లు, విశాలమైన రోడ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక సౌకర్యాలతో నిర్మించబోతున్నారు. రాబోయే 5 ఏళ్ళలో ఈ క్రిస్ సిటీ, అమరావతి, పోలవరం పనులు కొలిక్కివస్తే ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలే మారిపోతాయి.

ఇటువంటి మంచి, గొప్ప ఆలోచనలు, దూరదృష్టి, సంకల్పబలం, సామర్ధ్యం, నిబద్దత కలిగిన చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అవడం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల అదృష్టమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BJP Leader Targets Bollywood Star Over Mumbai Protest

Imran Khan recently came into the headlines when he was detained during demonstrations organized in…

18 minutes ago

Ranabaali Censor Twist: Did the Trailer Mislead Audiences?

Vijay Deverakonda and Rashmika Mandanna's upcoming film Ranabaali has cleared the censor process ahead of…

57 minutes ago