Telugu

అసలే రోజులు బాలేవ్‌.. అమిత్ షాతో చంద్రబాబు ఏం చెప్పారో!

ఇదివరకు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, అమిత్ అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌లని కలిస్తే దేని గురించి మాట్లాడేవారో అందరికీ తెలుసు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం భేటీ అని చెప్పుకున్నా గత 5 ఏళ్ళలో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు.

ADVERTISEMENT

కానీ జగన్‌ ఢిల్లీ వెళ్ళి తిరిగి రాగానే ఎంతో కొంత అప్పు పుడుతుండేది, మరో ఆలోచన లేకుండా దానిని ఆయన సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తుండేవారు.. అని అందరికీ తెలుసు.

వివేకా కేసులో సీబీఐ విచారణాధికారిపైనే జగన్‌ ప్రభుత్వం ఎదురు కేసులు పెట్టించినా కేంద్ర ప్రభుత్వం కిమ్మనలేదు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరికాళ్ళు వాచిపోయేలా చిదగొట్టినా కేంద్ర ప్రభుత్వం కిమ్మనలేదు. ఎందుకో వారికే తెలియాలి. కానీ ఢిల్లీ పర్యటనలతో ఏపీలో ఆరాచకాలను బ్యాలన్సింగ్ చేస్తుండేవారనే విషయం మాత్రం స్పష్టమైంది.

ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏదో ఓ పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా రోడ్లు, జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్లు, రైల్వే లైన్లు, రైళ్ళు, విమానాశ్రయాలు వస్తున్నాయి. కనుక చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో ఉపయోగం చాలా అవసరమని అర్దమవుతోంది.

సిఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవడమే వైసీపీ నేతలకు బహుశః ఆందోళన కలిగిస్తుండవచ్చు.

ఓ పక్క మద్యం కుంభకోణం కేసు వైసీపీ నేతల మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. దానిలో భారీగా ఆర్ధిక నేరాలు జరిగాయి. కనుక సీబీఐ, ఈడీల చేత విచారణ జరిపించాలని సిఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాని కోరితే వైసీపీ నేతల పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది.

ఏపీ ప్రభుత్వం అధీనంలో పనిచేసే ఏసీబీ లేదా సీఐడీ పోలీసుల చేత సిఎం చంద్రబాబు నాయుడు ఎన్ని విచారణలు జరిపించుకున్నా వైసీపీ నేతలకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. పైగా తమని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎదురుదాడి చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది.

కానీ సీబీఐ లేదా ఈడీ రంగంలో దిగితే వైసీపీ నేతలు కేంద్రాన్ని ఇంత సులువుగా విమర్శించలేరు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో ఏం చెప్పారో అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతుండటం సహజమే. ఏం చెప్పారో ఎలాగూ త్వరలో తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

22 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

51 minutes ago