Telugu

ఇదెక్కడి పోలిటికల్ ర్యాగింగ్ లోకేష్‌ బాబూ… బాబోయ్!


నేడు వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి దంపతులు పులివెందులకు వచ్చి ఆయన సమాది వద్ద నివాళులు అర్పించారు. తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోందని, దానిపై ప్రస్తుతం తానేమీ మాట్లాడబోనని అన్నారు. అయితే తన తండ్రికి న్యాయం జరిగేవరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని, అదే తన తండ్రికి తాను అర్పించే నివాళి అని ఆమె అన్నారు.

వివేక జయంతిపై టిడిపి యువనేత నారా లోకేష్‌ కూడా తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌, “ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి గారి జ‌యంతి, అబ్బాయిలు మ‌రిచిపోయిన‌ట్టున్నారు.

ADVERTISEMENT

వీరికి బాబాయ్‌ జ‌యంతి గుర్తుండ‌దు కానీ వ‌ర్థంతి మాత్రం డేట్, టైముతో స‌హా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతుల‌తోనే బాబాయ్ జ‌యంతికి ట్వీటు వేస్తే బాగోద‌నేమో వేయ‌లేదు.

అబ్బాయిల వేధింపులు-కుతంత్రాల‌కి ఎదురొడ్డి సోద‌రి సునీత గారు చేస్తున్న న్యాయ‌పోరాటంలో త‌ప్ప‌క గెలుస్తారు. త‌న తండ్రిని చంపిన క‌న్నింగ్ క‌జిన్స్‌తో జైలు ఊచ‌లు లెక్క‌పెట్టించే వ‌ర‌కూ విశ్ర‌మించ‌రు.

వివేకానంద‌రెడ్డి గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పిస్తున్నాను,” అంటూ ట్వీట్‌ చేశారు. కిందన “హూ కిల్డ్ బాబాయ్‌” దాని కిందన “అబ్బాయ్‌ కిల్డ్ బాబాయ్‌” అంటూ హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టారు.

గత ఎన్నికలలో వైసీపీ నారా లోకేష్‌ని చాలా దారుణంగా పొలిటికల్ ర్యాంగింగ్ చేసింది. కానీ ఇప్పుడు నారా లోకేష్‌ వారి అధినేతనే ర్యాంగింగ్ చేస్తున్నా వైసీపీలో అందరూ మౌనంగా భరిస్తున్నారు?

టిడిపి నేతలు దేని గురించి మాట్లాడినా వెంటనే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తుంటారు. అదే “హూ కిల్డ్ బాబాయ్‌” అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తుంటే వైసీపీలో ఏ ఒక్కరూ స్పందించరు! చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఇద్దరూ కడప వైసీపీ అడ్డాలో నిలబడి “హూ కిల్డ్ బాబాయ్‌” అని ప్రశ్నించినా మౌనమే సమాధానం!

ఎదురు సమాధానం చెపితే దానిపై చర్చ జరుగుతూనే ఉంటుంది… దాని వలన వైసీపీకి ఇబ్బందవుతుందని మౌనం వహిస్తున్నారేమో? గత ఎన్నికలలో వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే హత్య చేయించారన్నట్లు గట్టిగా వాదించి ఎన్నికలలో లబ్ధి పొందిన వైసీపీ నేతలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఎదురు ప్రశ్నిస్తుంటే మౌనం వహిస్తుండటం ఆశ్చర్యమే కదా?గత ఎన్నికలలో వైసీపీకి లబ్ధి కలిగించిన ఈ అంశమే వచ్చే ఎన్నికలలో వైసీపీ మెడకు చుట్టుకొంటుందేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 5th T20I: Bowling Woes Bring Swing King Back!

Bhuvneshwar Kumar is back in India's T20I squad after nearly four years, with the experienced…

2 minutes ago

ఈ జేబులో డబ్బు ఆ జేబులో పెట్టుకున్నా మనదేగా?

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఆలోచన చేస్తున్నప్పుడే చిన్న శ్రీనుతో సహా పలువురు టీడీపిలో చేరారు. అదేవిధంగా జనసేనలో…

33 minutes ago