
నేను ఏపీ రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, మరి చంద్రబాబు నాయుడు కి ఏపీలో సొంత ఇల్లు ఉందా.? అంటూ వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే టీడీపీ మీద, బాబు మీద వెటకారాలు, విమర్శలు చేస్తుండేవారు.
బాబు నివాసం ఒక అక్రమ కట్టడం, కరకట్ట మీద ముఖ్యమంత్రి నివాసమా.? ఇది సమంజసమేనా.? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా అక్రమ నిర్మాణాలను పోత్సహిస్తే ఎలా.? వరదలొస్తే బాబు అక్రమ నివాసం కనుమరుగు…ఇలా గత పదేళ్ల నుంచి బాబు నివాసం పై వైసీపీ అనవరస రాజకీయం చేస్తూనే వస్తుంది.
అయితే గత ఏడాది బాబు తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీ నోటికి తాళం వేసింది, జగన్ అసత్య ప్రచారాలకు బ్రేకులు వేయగలిగింది. 2024 ఎన్నికలలో టీడీపీ సాధించిన ఘన విజయంతో ఏపీ రాజధాని అమరావతి తిరిగి జీవం పోసుకుంది. దీనితో ఇక ఏపీకి శాశ్వత రాజధాని అమరావతి అన్నట్టుగా రాజకీయ వాతావరణాన్ని మార్చేశారు బాబు.
అందుకు తగ్గట్టుగానే రాజధాని ప్రాంతమైన వెలగపూడి లో సొంత ఇంటి నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని సదరు రైతు వద్ద నుండి కొనుగోలు చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే అతి త్వరలోనే ఈ స్థలంలో భూమి పూజ నిర్వహించి సాధ్యమైనంత త్వరగా తన సొంత ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు బాబు.
దీనితో ఇన్నాళ్ల వైసీపీ విమర్శలకు చెక్ పడినట్టే అవుతుంది. అలాగే రాజధాని ప్రాంతంలోనే బాబు ఇల్లు నిర్మించుకోవడంతో ఇక్కడి ప్రాంత ప్రజలకు కూడా తమ భూమి అభివృద్ధి మీద ఉన్న అపోహలు తొలిగిపోతాయి. వైస్ జగన్ మంగళగిరిలోని తాడేపల్లి ప్రాంతంలో నిర్మించిన పాలస్ గేటులు సాధారణ ప్రజలకే కాదు పార్టీ నాయకులకు కూడా తెరుచుకోవు అనేది వైసీపీ నేతలే ధృవీకరించారు.
ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా జగన్ ఉంటున్న తాడేపల్లి 2019 లో వైసీపీ హస్తగతమైనప్పటికీ గత ఐదేళ్ల జగన్ విధ్వంశం తో ఇప్పుడు నారా లోకేష్ గెలుపుతో అది టీడీపీ కంచుకోటగా రూపాంతరం చెందింది. అలాగే వెలగపూడి ఇంటి నిర్మాణం తో టీడీపీ ఒకరకంగా అక్కడి ప్రజలకు భరోసా కల్పించడం తో పాటుగా ఆ ప్రాంత అభివృద్ధితో రాజధానిని టీడీపీ అడ్డాగా మార్చుకోనుగలదు.
The next 24 hours could be extremely consequential in Indian politics as something big is…
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…