
విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు రాత్రిపూట కూడా సూర్యరశ్మిని అందించడం సాధ్యమేనన్నారు.
అయితే ఆయన ఆలోచనలు, దూరదృష్టిని అర్థం చేసుకునే సామర్థ్యం వైసీపీ నేతలకు లేదనే సంగతి ఎప్పుడో రుజువైంది. వారి సొంత మీడియా కూడా “అంటే చంద్రబాబు నాయుడు సూర్యుడి చేత ఓవర్‌టైమ్ చేయిస్తారా?” అంటూ అవహేళన చేసింది.
అయితే వైసీపీ నేతలకు తెలియని విషయం ఏమిటంటే, ఇప్పటికే కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే ఓ సంస్థ భారీ ‘మైలార్ అద్దాలు’ బిగించిన ఉపగ్రహాన్ని భూమికి 600-625 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.
దీంతో అది సూర్యరశ్మిని భూమిపై ఎంపిక చేసిన ప్రాంతాల్లో సుమారు 5 కిలోమీటర్ల వ్యాసంలో ప్రసరింప చేయాలని ప్లాన్ చేస్తోంది.
త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఈ అత్యాధునిక టెక్నాలజీ గురించే సీఎం చంద్రబాబు నాయుడు సీఐఐ సదస్సులో చెప్పారు. తద్వారా రాత్రిపూట కూడా సోలార్ ప్యానళ్లపై సూర్యరశ్మి పడేలా చేసి అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు.
కానీ ఇంకా ‘క్యూఆర్ కోడ్ స్కానింగ్’ దగ్గరే ఉండిపోయిన వైసీపీ నేతలకు క్వాంటం టెక్నాలజీ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్న ఈ కొత్త టెక్నాలజీ గురించి చెబితే ఏమర్థమవుతుంది? అర్థం కానప్పుడు ఎవరైనా వెకిలి నవ్వులే నవ్వుతారు కదా?
దీనికి సంబంధించి మరో ముఖ్య విషయం ఏమిటంటే, మన దేశంలో ప్రైవేట్ రంగంలో ఉపగ్రహాలను ప్రయోగించే రాకెట్లు (ఉపగ్రహ వాహక నౌకలు) తయారుచేసే సంస్థ స్కై రూట్ హైదరాబాద్‌లో ఉంది. ఇది తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయవంతంగా కక్ష్యను చేరుకుంది.
కనుక ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ సంస్థ తన భవిష్యత్తు ఉపగ్రహ ప్రయోగాల కోసం ‘స్కై రూట్’తో రెండు ప్రయోగాలకు ఒప్పందం చేసుకుంది. మొదటిది విక్రమ్-1 రాకెట్ ద్వారా, రెండోది ఇంకా అభివృద్ధిలో ఉన్న విక్రమ్-1U రాకెట్ ద్వారా జరగనుంది. స్కై రూట్ కంపెనీ ప్రతినిధులు కూడా ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు.
ఈ విషయాలేవీ తెలుసుకోకుండానే, ‘రాత్రిపూట సూర్యరశ్మి ప్రసారం సాధ్యమే’నని సీఎం చంద్రబాబు నాయుడు అనగానే వెకిలి నవ్వులు నవ్వడం మొదలుపెట్టేశారు.
After an interesting interaction with Upasana Konidela on the first day of the 31st CII…
Anaswara Rajan is taking an interesting route in Telugu cinema. Along with playing lead actress…