
తాజా లెక్కల ప్రకారం మొత్తం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి 58391 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనాలు సవరించి కేంద్రానికి పంపించామని ఆయన ప్రకటించారు. దీనిలో సింహభాగం నిర్వాసితుల పనుల కోసమే. అదే రకంగా పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, స్పిల్‌వే పనులు 72శాతం, డయా ఫ్రం వాల్ పనులు 47.99శాతం, మట్టి పనులు 72 శాతం పూర్తయ్యాయి.
రేడియల్ గేట్లు వంద శాతం పూర్తయ్యాయని ఆయన వివరించారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపి రామచంద్ర రావు వేసిన ప్రజాహిత వ్యాజ్యం స్వీకరించిన హైదరాబాద్ హైకోర్ట్ తన వైఖరి చెప్పాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఆ కేసు విచారణ వచ్ఛే నెల 7న జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.…
Most people think twice before eating street food because it is exposed to dust, traffic…