
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి తన ప్రత్యర్ధులను రాజకీయంగా వేధిస్తూ, వీలైతే భౌతికంగా హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారని రఘురామకృష్ణరాజు వంటి ఆయన బాధితులు కధలు కధాలుగా చెప్పుకుంటుంటారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు వైసీపి నేతలు టపాకాయలు కాల్చుకుని, స్వీట్లు పంచుకోవడం కూడా అటువంటిదే అంటారు టిడిపి నేతలు.
టిడిపితో పొత్తుపెట్టుకున్నందుకు, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి జగన్ మాట్లాడటం కూడా అటువంటిదే అని జనసేన నేతలు చెప్పుకుంటారు.
చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లపై కక్షతో వారి సినిమాలకు అవరోధాలు సృష్టించడం, చిరంజీవితో సహా సినీ పెద్దలు అందరూ తాడేపల్లి వచ్చి ప్రాధేయపడేలా చేయడం వంటివి పైశాచిక ఆనందమే అంటారు సినీ పరిశ్రమలోని వారు.
తన అధికారానికి ప్రమాదంగా మారితే సొంత చెల్లెలిని కూడా ఉపేక్షించకుండా వైసీపి నేతల చేత ఆమెపై నీచమైన కామెంట్స్ చేయిస్తుండటం కూడా పైశాచిక ఆనందమే అని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారిప్పుడు.
ఇప్పటికే వైసీపిలో అందరికీ ఈ అంటూ వ్యాధి వ్యాపించిందని, ఎంతగా అంటే వైసీపి ఎమ్మెల్యేలలో అనిల్ కుమార్ యాదవ్ వంటివారు ప్రసంగించేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని భాష,యాసని అనుకరిస్తూ, జగన్లాగే చేతులు తిప్పుతూ, హావభావాలు ప్రదర్శిస్తూ మాట్లాడుతుండటారు. కనుక గుణాలు కూడా అబ్బవని అనుకోలేము.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు వైసీపిలో పైనుంచి కింద వరకు ఈ పైశాచికానందం కూడా కరోనాలా విస్తరించిపోయింది.
నేడు భీమిలి నియోజకవర్గంలో తగరపువలస జంక్షన్ వద్ద జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతున్న బహిరంగ సభకు వెళ్ళేదారిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సీపీఐ రామకృష్ణ, పెత్తందారులన్నట్లు సూచించే విధంగా వికృతమైన ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టారు.
ఏ పార్టీ అయినా తమ సభలలో తమ అధినేత, నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు పెట్టుకుంటుంది. కానీ జగన్ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సీపీఐ రామకృష్ణల ఫోటోలతో బ్యానర్లు పెట్టడం వైసీపి నేతల పైశాచికనందానికి పరాకాష్ట కదా?జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకు స్థానిక వైసీపి నేతలు చేసిన ఈ ప్రయత్నం ఫలించి వారికి టికెట్స్ లభిస్తాయో లేదో తెలీదు కానీ ప్రజల దృష్టిలో వారే చులకలనవుతారు.
Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…