
వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ పాలిటిక్స్ లోకి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లుకొడుతుంది. ‘ఏపీలో వింత రాజకీయం’ పేరుతో సోషల్ మీడియాలో ఏపీలో రాజకీయ పార్టీల అధినేతల పై ఒక భిన్న కథనం సర్క్యూలేట్ అవుతుంది.
ఏపీలో ఉన్న నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న నాయకులు నలుగురు రెండు కుటుంబాలకే సంబందించిన వారు కావడం ఇక్కడ చర్చకు దారి తీసింది. నారా, నందమూరి కుటుంబానికి సంబందించిన చంద్రబాబు నాయుడు, పురందరేశ్వరి ఇద్దరు ఎన్టీఆర్ కుటుంబసభ్యులే అయినప్పటికీ రాజకీయ పరంగా రెండు భిన్న పార్టీల అధ్యక్షులుగా ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నారు.
టీడీపీ అధినేతగా నారా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధినేతగా దగ్గుపాటి పురందరేశ్వరి. ఒకరు ఎన్టీఆర్ అల్లుడుగా, మరొకరు ఎన్టీఆర్ కూతురుగా రాజకీయ ప్రత్యర్థులుగా వారి వారి రాజకీయ సిద్దాంతాలకు కట్టుబడి ముందుకెళ్తున్నారు. అలాగే రాజకీయాలలో తనదైన ముద్రవేసిన వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కూడా ఆయన మరణానంతరం రాజకీయ వేదికల మీదకు వచ్చారు.
తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని కాదని వైసీపీ పార్టీ ఏర్పాటు చేసి యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను అధికార పీఠం నుండి దించడానికి, తన తండ్రి నమ్మిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అందుకున్న వైస్ షర్మిల ఇప్పుడు తన సొంత అన్న పై రాజకీయ యుద్దానికి సిద్ధమయ్యారు.
ఇలా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైస్ షర్మిల, వైసీపీ అధ్యక్షుడిగా వైస్ జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు సొంత కుటుంబ సభ్యులే అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అయితే వైస్ కుటుంబం నుంచి ‘అన్నా చెల్లెళ్ళ రాజకీయ సమరం’, ఎన్టీఆర్ కుటుంబం నుంచి ‘వదినా మరిది’ పోరు చూడడానికి 2024 ఎన్నికలు ఎదురుచూస్తున్నాయి.
2024 ఎన్నికలలో ఏపీలో డబుల్ ధమాకా ఇవ్వడనికి వైస్ కుటుంబం, నందమూరి కుటుంబం సిద్దముగా ఉందంటూ సోషల్ మీడియాలో….
ఎన్టీఆర్ అల్లుడు : టీడీపీ అధ్యక్షుడు,
ఎన్టీఆర్ కూతురు: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు,
వైస్సార్ కుమారుడు: వైసీపీ అధ్యక్షుడు,
వైస్సార్ కూతురు: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు…ఏపీలో “వింత రాజకీయాలు” అంటూ పార్టీల అధ్యక్షుల పేర్లను వైరల్ చేస్తూ “రాజకీయాలలో బంధానికి బందుత్వానికి స్థానం” లేదు అని ఏపీ రాజకీయాలు రుజువుచేయబోతున్నాయా..?అనే ప్రశ్నను సంధిస్తున్నారు నెటిజన్లు.
The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…