
దీనితో ప్రభుత్వం మీద భారీగా ఒత్తిడి వస్తుంది. దీనితో కొందరు స్థానిక టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి వారిని నేరం ఒప్పుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే మొదటి నుండీ కూడా ఈ విషయంగా చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అనేక ఘటనలలో ఇప్పటిదాకా దోషులను పట్టుకోలేదు.
పై పెచ్చు… ఈ ఘటనల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారంటూ మంత్రులతో విమర్శలు చేయిస్తున్నారు. ఈ ఘటనలు నిజంగా చంద్రబాబే చేయించారు అనుకున్నా… కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తే దానికి విలువ ఉండదు. మొత్తం పోలీసు వ్యవస్థ తమ చేతిలో ఉంది కాబట్టి దానిని నిరూపించి బాధ్యులను జైలుకు పంపాలి.
అది చెయ్యకుండా రాజకీయ విమర్శలకే పరిమితం అయితే… అతి తొందరలో ప్రభుత్వ పాత్ర మీద కూడా అనుమానాలు మొదలవుతాయి. రాజకీయంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. తిరుపతి ఉపఎన్నిక, రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఎంత మాత్రం అధికార పక్షానికి మంచిది కాదు.
Gujarat Titans defeated Rajasthan Royals by 77 runs in the 52nd match of IPL 2026.…
Suriya’s long-delayed film Karuppu, directed by RJ Balaji, has finally locked its theatrical release date.…