
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్నీ ఒక అవకాశంగా మలచుకుందాం. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమ శిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనమందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాము.
అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ఈ క్షణంలో మనమందరం చేపడుతున్నాం. జై హింద్… జై ఆంధ్రప్రదేశ్… జైజై ఆంధ్రప్రదేశ్” అంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఏపీ ప్రజల చేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.
Vishwak Sen planned to watch Cult with audiences at Hyderabad’s Sudarshan 35MM Theatre on its…
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, which was released in…