Telugu

హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

చంద్రబాబు నాయుడు, కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన్నట్లు ప్రజలకు వాగ్ధానాలు చేసేసి వారిని మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చారని 10 ఎమ్మెల్యేల అధినేత జగన్‌ పదేపదే ఆరోపిస్తుంటారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీనీ నెరవేర్చకుండా నిర్భయంగా ప్రజలను మోసం చేస్తున్నారని, వాటి గురించి తాము అడుగుతుంటే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్‌ అండ్ కో వాదిస్తుంటారు.

ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కో హామీనీ అమలుచేస్తుండటంతో, ఆ విషయం కూటమిలో కోవర్టుల ద్వారా ముందే తెలుసుకొని ఆ హామీ అమలుచేయాలంటూ వైసీపీ ధర్నాలు, దీక్షలు చేస్తుంది.

ADVERTISEMENT

అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఆ హామీ అమలు చేయగానే మేము పోరాడి ఆయన మెడలు వంచి హామీ అమలుచేయించామని హామీ క్రెడిట్ సొంతం చేసుకుంటుంటారు. అయితే ఈసారి వైసీపీకి అవకాశం కూడా లేకుండా చేశారు సిఎం చంద్రబాబు నాయుడు.

చడీ చప్పుడూ లేకుండా మత్స్యకార భరోసా పధకాన్ని అమలుచేశారు. ఈ పధకంలో భాగం రాష్ట్రంలో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున నిధులు విడుదల చేశారు. వారందరికీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల పంపిణీ చేయిస్తున్నారు.

ఏటా ఏప్రిల్-మే నెలల్లో రెండు నెలల పాటు సముద్రంలో చేపలు గుడ్లు పెడుతుంటాయి. ఆ సమయంలో చేపల వేటపై నిషేధం ఉంటుంది కనుక మత్స్యకారులకు ఆదాయం ఉండదు. వారిని ఆదుకునేందుకు టీడీపీ 2014లో ఈ పధకం ప్రవేశపెట్టి అమలు చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా అమలు చేస్తోంది.

ఈవిదంగా సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కో పధకం అమలుచేస్తుంటే, ఇక తాము దేని కోసం పోరాడాలి? ఎవరితో పోరాడాలి? అని వైసీపీ అధినేత తాడేపల్లి ప్యాలస్‌లో తల పట్టుకొని కూర్చొని ఉండవచ్చు.

జగన్‌ గొప్పగా చెప్పుకునే పధకాలలో ‘అమ్మ ఒడి’ ఒకటి. ఆ పధకంతో ఇంట్లో ఇద్దరి పిల్లల చదువులకి రూ.10 వేలు చొప్పున ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్‌, ఆ తర్వాత ఆ భారం తగ్గించుకునేందుకు ఒకరికే రూ.7-8,000 చేతిలో పెట్టి మమ అనిపించేశారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పిల్లల్ని కంటే వారికి కూడా ఇస్తామని చెపుతున్నారు!

ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు రూ.20,000 చొప్పున అందిస్తున్నారు. ఇలా అయితే వైసీపీలకు పనిలేకుండా పోతుందిగా!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

15 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

45 minutes ago