వంగవీటి స్లోగన్ కు బాబు షూరిటీ…!

దెందులూరు ప్రజాగళంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వంగవీటి రాధా. ఈ నేపథ్యంలో రాధాను ఉద్దేశించి ప్రసంగించిన బాబు…ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తి రాధా, తండ్రి పేరు చెప్పుకుని పదవులు ఆశించ కుండా తండ్రి ఆశయాల కోసం పని చేసే వ్యక్తి రాధా, కూటమి అభ్యర్థుల విజయం కోసం వైసీపీ తో పోరాడుతున్న రాధా సేవలు రాష్ట్రానికి అవసరం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాధకు తగిన గౌరవం ఇచ్చి సరైన న్యాయం చేసే బాధ్యత నాది, అంటూ దెందులూరు సభ సాక్షిగా వంగవీటి రాధకు ‘బాబు షూరిటీ’ ఇచ్చారు. దీనితో ఇన్నాళ్ల నుంచి వంగవీటి కుటుంబానికి బాబు అన్యాయం చేసారు, చేస్తున్నారు అంటూ ఆయన కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కాపు సమాజాన్ని రెచ్చగొడుతున్న వైసీపీ కి పనిలోపనిగా కౌంటర్ కూడా ఇచ్చారు బాబు.

ADVERTISEMENT

అలాగే రాధా కూడా వైసీపీ నుంచి ఎన్ని ప్రలోభాలొచ్చినా, తమ పార్టీలో చేరాలి అంటూ ఎంత ఒత్తిడి చేసిన వాటన్నిటిని దాటి ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా టీడీపీ జెండా విడిచిపెట్టలేదు. అలాగే కూటమి అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. ఇందులో భాగంగానే దెందులూ సభలో ప్రసంగించిన రాధా జగన్ పై విరుచుకుపడ్డారు.

బటన్ నొక్కుతున్నా అంటూ చెప్పుకుంటున్న జగన్ ఆ ప్రక్రియలో భాగంగా తాను నొక్కేసిందేంతో కూడా చెపితే బాగుంటుందని, ‘చేయి చేయి కలుపు…చేజారదు గెలుపు’ తన తండ్రి వంగవీటి రంగ ఇచ్చిన స్లోగన్ ను గుర్తుచేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas Postponement Curse: Will Fauzi & Spirit Break It?

Prabhas and postponements have an interesting history. On several occasions, his films moved away from…

7 minutes ago

Romance Failed, Will Horror Save Kriti Sanon from Flops?

Kriti Sanon is ready to enter uncharted territory with her next big screen outing. The…

28 minutes ago