
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరోసారి మరో కొత్త అధ్యాయం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయడంతో ఈ కొత్త అధ్యాయం మొదలవుతుంది.
గత 5 ఏళ్ళుగా జగన్ విధ్వంస పాలనతో వేసారిపోయిన రాష్ట్ర ప్రజలు టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి కనీవినీ ఎరుగని మెజార్టీతో గెలిపించారు. జగన్ 5 ఏళ్ళ అరాచక పాలన చూసిన ప్రజలు రాష్ట్రంలో మళ్ళీ శాంతిభద్రతలు నెలకొనాలని కోరుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు వేగంగా అభివృద్ధి చేస్తారని, ఈసారి అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి ఉద్యోగాలు కల్పిస్తారని రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశిస్తోంది. ఈవిదంగా రాష్ట్రంలో ప్రతీవర్గం తొలిసారిగా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గన్నవరం వద్ద కేసరపల్లిలో ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీబ్ వారిచేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు.
చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్లతో సహా మొత్తం 25 మంది మంత్రుల జాబితా ఇప్పటికే విడుదల చేశారు. వారిలో 17 మంది కొత్తగా మంత్రి పదవులు చేపట్టబోతున్నారు. మంత్రివర్గం కూర్పు చూసినప్పుడు సీనియర్లకు, యువతకు, అలాగే అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన్నట్లు అర్దమవుతుంది. చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి 8 మంత్రి పదవులు ఇవ్వగా, కమ్మ: 4, కాపు: 4, రెడ్డి: 3, ఎస్సీ:2, ఎస్టీ: 1, ఆర్యవైశ్య:1, ముస్లిం మైనార్టీ: 1 మంత్రి పదవి లభించాయి.
మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు అనిత వంగలపూడి, గుమ్మడి సంద్యారాణి, ఎస్ సవితలకు అవకాశం కల్పించారు.
పార్టీల వారీగా చూస్తే టిడిపి: 21 , జనసేన: 3, బీజేపీ: 1 మంత్రి పదవులు కేటాయించారు. మరో మంత్రి పదవిని రాబోయే రోజుల్లో భర్తీ చేస్తారు.
ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో 36 వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంకా చిరంజీవి, రజనీకాంత్ వంటి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తుండటంతో గన్నవరం విమానాశ్రయం నుంచి సభాస్థలి వరకు సుమారు 7,000 మంది పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భద్రతా ఏర్పాట్లను 60 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాది మంది అభిమానులు సభస్థలికి చేరుకోవడంతో వారి కోలాహలంతో అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొంది.
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…