Telugu

76 ఏళ్ళ యువకుడు… చంద్రబాబు నాయుడు!

నేడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు… శుభాకాంక్షలు! నేటితో 75 ఏళ్ళు పూర్తి చేసుకొని 76లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అందరికీ ఈ సంఖ్య వయసు కొలమానం కాగా, ఆయనకు మాత్రం ఇదొక సంఖ్య మాత్రమే. అందువల్లే ఈ వయసులో కూడా యువకుడిలా చురుకుగా పని చేయగలుగుతున్నారు.

ADVERTISEMENT

అమరావతి, పోలవరం, పరిశ్రమలు, పెట్టుబడులపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో జరిగే వాటి శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతుంటారు.

ఈ అభివృద్ధి పనులకు అవరోధాలు సృష్టిస్తూ, కూటమి ఐఖ్యతని దెబ్బతీసి అధికారంలోకి రావాలని ప్రభుత్వంపై కుట్రలు, దుష్ప్రచారం చేస్తున్న వైసీపీని నిలువరించాలి. కనుక చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా రాజకీయాలు కూడా చేస్తుండాలి.

ఇన్ని పనులు చక్కబెడుతూనే నెల తిరిగే సరికి రాష్ట్రంలో ఏదో ఓ జిల్లా పర్యటనలో నేరుగా సామాన్య ప్రజలను కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు.

ఇంతటితో అయిపోలేదు.. ఈ వయసులో కూడా క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకొని, అవగాహన పెంచుకుంటారు. దాంతో ఉద్యోగాల కల్పన, రాష్ట్రావసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కూడా!

ఇన్ని పనులూ ఏకకాలంలో నిర్వహిస్తూనే కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు, అప్పులు అన్నీ సకాలంలో వచ్చేలా పర్యవేక్షిస్తుండాలి.

దీని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు మరింత బలపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల లోక్‌సభలో డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ప్రకటించడం, అవి తిరస్కరణకు గురవడంతో కేంద్రానికి సంఘీభావం తెలుపుతూ ట్వీట్స్ చేయడం, మహిళలతో కలిసి సిఎం చంద్రబాబు నాయుడు ర్యాలీలో పాల్గొనడం ఇందుకు నిదర్శనలే కదా?

నేడు పుట్టినరోజు సందర్భంగా హాయిగా కుటుంబంతో లేదా పార్టీ నేతలతో లేదా మంత్రులతో వేడుకలు చేసుకోవచ్చు. కానీ విజయవాడ అన్న క్యాంటీన్‌లో సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేయబోతున్నారు! ఆ తర్వాత తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అన్నాడీఎంకే-బిజేపి కూటమి తరపున ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్తారు.

76 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు ఇన్ని పనులు చేయగలుగుతున్నారంటే, ఆయన 76 ఏళ్ళ యువకుడనే భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK 47 Postponement Mystery: What Is Trivikram Hiding?

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…

13 minutes ago

Sanjay Dutt Clarified But AI Changed the Question

Sanjay Dutt faced severe criticism after a recent appearance on Shekhar Suman’s show. His comments…

43 minutes ago