
2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చావు బతుకుల సమస్యగా మారిపోయింది. గత ఐదేళ్ల నుండి సంక్షేమం తప్ప అభివృద్ధి అనే పేరు కూడా వినపడకుండా పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాలేక పోయిన ఉన్న పరిశ్రమలను కూడా బతికి బట్టకట్టనివ్వవలేదు.
వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేక, వారి నాయకులకు ముడుపులు ఇవ్వలేక ఏపీ నుండి గత ఐదేళ్లుగా ఎన్నో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. అందులో జాకీ, అమర్ రాజా, లూలూ…ఇలా ఎన్నో పరిశ్రమలు రాష్ట్ర సరిహద్దు దాటిపోయాయి. అయితే ప్రజలు ఈ ఎన్నికలలో పార్టీల తలరాతలు తలక్రిందులు చేస్తూ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు.
దీనితో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తమకున్న అధికారంతో విధ్వంసాలకు పాల్పడ్డ ప్రతి ఒక్క వైసీపీ నాయకుడి మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలలో భాగంగానే తమ పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందంటూ జగన్ జైలు యాత్రలు మొదలుపెట్టారు. పార్టీ నేతలకు అండగా ఉంటానంటూ పరామర్శల యాత్రలు చేస్తున్న జగన్ జైలు ములాఖత్ లతో బిజీగా ఉన్నారు.
ఇటు పక్క చంద్రబాబు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పరిశ్రమలను తిరిగి రాష్ట్రానికి ఆహ్వానించడానికి పారిశ్రామిక వేత్తల ములాఖత్ తో బిజీగా ఉన్నారు. మచిలీపట్నం కేంద్రంగా BPCL సంస్థ ఏపీలో 60 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు బందర్ ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు BPCL ప్రతినిధులు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి విచ్చేసారు.
మరి కాసేపట్లో సంస్థ ప్రతినిధులు ఏపీలో సంస్థ ఏర్పాటు పై సీఎం చంద్రబాబు తో భేటీ కానున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా ఒక కొత్త పెట్రోల్ బంక్ ను కూడా ఏర్పాటు చేయలేకపోయింది జగన్ ప్రభుత్వం. కానీ జగన్, వైసీపీ అనే బ్రాండ్స్ ప్రతిపక్షానికి పరిమితమైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఎంత ఆసక్తిగా ముందుకొస్తారో ఈ ఒక్క ఘటనతోనే స్పష్టమయింది.
ఈ సంస్థ ఏర్పాటుకు అవసరమైన 2 నుంచి 3 వేల ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడంతో BPCL ఏర్పాటు దాదాపు ఖరారయినట్టే. బాబు కూడా పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు పెద్ద పీఠ వేస్తారు అని మరోసారి ఈ ఘటనతో నిరూపించుకున్నారు. ఈ సంస్థ ప్రారంభమైతే సుమారు 25 వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుంది.
ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షం పాలక పక్షం ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. దీనితో ఇటు జగన్ జైలు ములాఖత్ లు…అటు బాబు పారిశ్రామికవేత్తల సమావేశాలు చూసి ఎవరి బ్రాండ్ వారు నిలబెట్టుకున్నారు తప్పెమేముంది అంటూ సోషల్ మీడియాలో జగన్, బాబు ల పై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…