చాణక్య స్టాటజీ: జగన్ “వై నాట్ 175 కల” కలగానే మిగలనుందా..?

దొరల పాలనకు, ప్రజా పాలనకు మధ్య వ్యత్యాసం చూపిస్తాం అంటూ హోరాహోరీ విమర్శలతో తెలంగాణ రాష్ట్రమంతా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని సాధించి తెలంగాణలో 64 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వ పగ్గాలను సొంతం చేసుకోగలిగింది.

అలాగే తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ తెచ్చిన పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ అధికారానికి చెక్ పెట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన పలు సర్వే సంస్థలు తమ నిబద్దను, ప్రామాణికాన్ని మరోసారి నిరూపించుకున్నాయి.

ADVERTISEMENT

ఇప్పుడు ఏపీలో కూడా పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ అధికార వైసీపీ పార్టీ, అభివృద్ధికి – అధికార అహంకారానికి మధ్య యుద్ధం అంటూ ప్రతిపక్షాలు ఒకరి పై మరొకరు రాజకీయ యుద్ధమే చేస్తున్నారు.రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి మరి తెస్తాను అంటూ మాట ఇచ్చిన జగన్ ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచడం కాదు కానీ రాష్ట్ర రాజధానిని మార్చి మూడు ముక్కలాట మొదలు పెట్టి నమ్మి ఓటేసిన ప్రజల వెన్ను విరిచాడు, మడం తిప్పారు అనే అపవాదును మూటకట్టుకున్నారు.

జగన్ నాలుగున్నరేళ్ల పాలనను, ప్రతిపక్ష పార్టీల నాలుగున్నరేళ్ళ పోరాటాలను మేరీజు వేసుకుని రాబోయే ఎన్నికలలో గెలుపు గుర్రం అధిరోహించే పార్టీ ఏది అంటూ సర్వేలు మొదలుపెట్టే సర్వే సంస్థలు డ్యూటీ ఎక్కారు. ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటైన “చాణక్య స్టాటజీస్” అనే సంస్థ ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను రాజకీయ పార్టీలకు న్యూ ఇయర్ గిఫ్ట్ కింద విడుదల చేశారు.

ఏపీలో పొత్తులో ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తున్న టీడీపీ – జనసేన కూటమి వైసీపీ గెలుపుని కడ్డడి చేయడంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందంటూ టీడీపీ – జనసేన పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన కూటమి 175 నియోజకవర్గాల్లో 115 నుండి 128 స్థానాలలో విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనపడుతుందంటూ వైసీపీ పార్టీకి సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాక్ ల కంటే పెద్ద షాక్ ఇచ్చింది ఈ సర్వే సంస్థ.

వైసీపీ పార్టీకి 42 నుంచి 55 సీట్లు రావచ్చని, రాష్ట్రంలో మొత్తం 18 స్థానాలలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంటుందని సర్వే సంస్థలు తేల్చి చెప్పారు. దీనితో జగన్ కంటున్న “వై నాట్ 175 కల” కలగానే మిగలడం ఖాయంగా కనపడుతుంది.వైసీపీ,టీడీపీ, జనసేన కాకుండా 4 నుంచి 7 స్థానాల మధ్య ఇతరుల ప్రభావం ఉండొచ్చని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనితో టీడీపీ పార్టీకి 43 శాతం, వైసీపీ కి 41 శాతం, జనసేనకు 10 శాతం ఓట్లు నమోదు కావచ్చు అని అంచనా.

ఒక్క కర్నూలు జిల్లా మినహాయిస్తే మరే స్థానంలోనూ వైసీపీ పార్టీ తన పట్టును నిలుపుకోలేక పోయిందని సర్వే నివేదికలో పొందుపరచడం జరిగింది. జగన్ నిర్ణయించిన రాజధాని విశాఖలో కూడా వైసీపీ కి ఎదురుగాలి వీస్తుండడం ఇక్కడ గమనార్హం. చాణక్య స్టాటజీ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈసారి ఏపీలో కూడా ప్రజలు అధికార మార్పిడి కోరుకుంటున్నారని తేలిపోయింది.

దీనికి జగన్ తీసుకున్న ప్రతిపక్ష నేతల అరెస్టు వంటి అనాలోచిత నిర్ణయాల నుండి, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారనే ఆరోపణలను ప్రతిపక్షాలు బలంగా ప్రజలలోకి తీసుకెళ్లడం, వైసీపీ నాయకుల బూతుల రాజకీయ విమర్శలు, ఇచ్చిన హామీల నుండి జగన్ వెనక్కి వెళ్లిన తీరు, రాజధాని నిర్ణయం అన్ని కలిసి వైసీపీ ఓటమిని ప్రభావితం చేయనున్నాయంటూ సర్వే సంస్థలు విడుదల చేసిన నివేదికల వలన రాష్ట్ర వ్యాప్త చర్చ మొదలయ్యింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

22 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

29 minutes ago