2024 కంటే పెరిగిన కూటమి బలం…వైసీపీ తో 25.34% గ్యాప్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర గణాంకాలను వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్ల శాతం మరింత పెరిగిందని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఫలితాలు ప్రతిబింబమని పేర్కొన్నారు.

ADVERTISEMENT

2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా, తాజా స్థానిక ఎన్నికల్లో 58.9 శాతానికి పెరిగాయి. అంటే కూటమి ఓట్ల శాతం 3.6 శాతం పెరిగింది. మరోవైపు 2024లో 39.81 శాతంగా ఉన్న వైసీపీ ఓట్ల శాతం ఇప్పుడు 33.56 శాతానికి పడిపోయింది. దీంతో రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 25.34 శాతానికి చేరిందని చంద్రబాబు వివరించారు.

పట్టణ ప్రాంతాల్లో కూటమికి 59.9 శాతం, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కూటమి ఆధిపత్యం కొనసాగిందని సీఎం తెలిపారు.

జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూటమి స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా నమోదైంది. పట్టణాల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 25.6 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతంగా ఉందని వెల్లడించారు.

ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 9,818 స్థానాలకు గాను కూటమి 7,803 స్థానాలను సాధించిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

పోస్టల్ బ్యాలెట్లలోనూ కూటమికి గణనీయమైన మద్దతు లభించింది. పట్టణ ఎన్నికల్లో ఎన్డీఏకు 65.7 శాతం, వైసీపీకి 27.42 శాతం పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లో కూటమికి 62.83 శాతం, వైసీపీకి 31.46 శాతం పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి.

జెడ్పీటీసీ ఫలితాల్లో మొత్తం 659 స్థానాలకు గాను 575 స్థానాలను కూటమి గెలుచుకుందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీకి కూటమి కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏడు జిల్లాల్లో వైసీపీ ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా స్థానిక సంస్థల్లో కూటమి ఓట్ల శాతం పెరగడం, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మద్దతు కొనసాగడం తాజా ఫలితాల్లో ప్రధానంగా కనిపించిన అంశాలని చంద్రబాబు పేర్కొన్నారు.

అయితే నాడు 2024 వైసీపీ ఘోర ఓటమికి సీట్లు కాదు మా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని చూడండి అంటూ పార్టీ ఓటమి అవమాన భారాన్ని తగ్గించాలని చూసిన వైసీపీ కి ఇప్పుడు ప్రజలు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఓట్లను కూడా కరిగించేసారు…మరి ఇప్పుడు వైసీపీ సీట్లు పోయి, ఓట్లు పోయి తమ పార్టీ ఓటమిని ప్రజల ముందు ఎలా సమర్ధించుకోగలదు.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

TDP Alliance Gains to 58.90%, YSRCP Drops to 33.56% : Chandrababu

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu said the TDP-JanaSena-BJP alliance had increased its vote…

17 minutes ago

గన్నవరం గెలుపు వంశీ క్రెడిట్ అయితే మరి పులివెందుల ఓటమి..?

తాజాగా వెలువడిన స్థానిక ఎన్నికల ప్రజాతీర్పు అటు అధికార కూటమి పార్టీలకు ఇటు విపక్ష వైసీపీకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను,…

36 minutes ago