
Chandrababu and Pawan Launch Jal Jeevan Mission 2.0
అభివృద్ధి గురించి ఆలోచించాలంటే అమరావతి, పోలవరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు, ఒకటొకటిగా పూర్తవుతున్న సాగుతాగు నీటి ప్రాజెక్టుల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.
నిజానికి గత ప్రభుత్వ హయంలో ప్రజలు ఇలాంటి అభివృద్ధి పనుల గురించి వినాలని ఐదేళ్ళపాటు ఆశగా ఎదురుచూశారు. కానీ వారికి వేరేవి కనిపించాయి.. వినిపించాయి.
కనుక ఇప్పుడు తాము కోరుకున్న అభివృద్ధిపనుల గురించి వినే అవకాశం వచ్చినప్పుడు, గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి కథలు, వైసీపీ నేతల కేసులు, వారి వాదనలు కూడా వినాల్సి వస్తోంది. ఒక్కోసారి ఆ వార్తలే రాష్ట్రాభివృద్ధి వార్తలను మింగేస్తున్నాయి కూడా. ఇవి సరిపోవన్నట్లు పొరుగు రాష్ట్రంలో అవినీతి కేసులు కూడా ఏపీ అభివృద్ధివార్తలను మింగేస్తున్నాయి.
వివేకా హత్య కేసుతో సహా మద్యం కుంభకోణం, దాని రవాణా కుంభకోణం కేసులను ఈడీ విచారణ జరుపుతోంది. బుగ్గ మఠం భూముల కేసులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మద్యం కేసులో మిథున్ రెడ్డి వంటి పలువురు సుప్రీంకోర్టుకి వెళ్తే, అక్కడా వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయంటే, న్యాయాన్యాయాలు, కేసుల తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవచ్చు.
కనుక ఈ అవినీతి కేసుల వార్తల మధ్య నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వార్తలను ప్రజలు వెతుక్కొని చదువుకోవాల్సి వస్తోంది.
తాజాగా జగన్ కంచుకోట కడప జిల్లాలోని పొద్దుటూరులో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ‘జల జీవన్ మిషన్‌లో భాగంగా ‘అమరజీవి జలధార ప్రాజెక్టు 2.0’ పనులకు సోమవారం పైలాన్ ఆవిష్కరించారు.
రూ.30,156 కోట్లతో జిల్లాలోని 90 లక్షల మందికి తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. రెండేళ్ళలో దీనిని పూర్తిచేసి ఇంటింటికీ నీళ్ళు అందిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు.
గత రెండున్నరేళ్లుగా సగటున ప్రతీ రెండు నెలలకోసారి ఇలాంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్నిటికీ ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి.
కానీ ఈ వార్తల కంటే వైసీపీ నేతల అవినీతి కేసులు, రప్పారప్పా బల ప్రదర్శనల వార్తలే ఎక్కువైపోయినట్లు అనిపిస్తోంది. ఇందుకు ప్రజలు సంతోషించాలో, బాధపడాలో తెలీని పరిస్థితి!
The fifth week began in the Bigg Boss house with the theme, Road to Reload.…
The Janhvi Kapoor deepfake controversy may end up being remembered for something bigger than the…