Telugu

సభలో ఇదేం గోల? జనానికి చంద్రబాబు వార్నింగ్!

నేడు అన్నమయ్య జిల్లా, మదనపల్లిలో రాయలసీమ ఉద్యాన హబ్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించబోతుంటే సభకు హాజరైన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆటంకం కలిగించారు. ఆమె పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ వినకుండా సభలో గోల చేస్తుండటంతో సిఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు.

వెంటనే లేచి వెళ్ళి అందరినీ బుద్ధిగా కూర్చోవాలని హెచ్చరించారు. “నేను, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరం ఎప్పుడూ ఇక్కడ ఉంటాము. కానీ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మన కోసం వచ్చారు. ఆమె చెపుతున్నారో వినాలి. ఇలా గోల చేయడం సరికాదు..,” అంటూ నిలబడిన వారిని ఉద్దేశ్యించి అందరూ కూర్చోవాలని సిఎం చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు.

ADVERTISEMENT

అయినా కొందరు కూర్చోకపోవడంతో “ఏం తమ్ముళ్ళు కూర్చోమని చెపుతుంటే వినపడటం లేదా?కూర్చోండి,” అంటూ గట్టిగా గద్దించారు. అప్పుడు గానీ వారు కూర్చోలేదు. ఆ తర్వాత ఆమె ప్రసంగం కొనసాగించారు.

సభలో ప్రజలు ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?అంటే మన రాజకీయ పార్టీ నాయకులే వారికి ఇటువంటి దురలవాటు నేర్పించారని చెప్పక తప్పదు.

రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయ నాయకులు బహిరంగ సభలలో ప్రజలను ఉత్తేజపరచాలనే ఆలోచనతో లేదా తాము చెప్పింది నిజమేనని వారిచేత అనిపించుకునేందుకో వేదికలపై నుంచి వారితో ఇంటరాక్ట్ అవుతుంటారు.

అలా మొదలైన ఈ జాడ్యం ‘ఎవరు మాట్లాడుతున్నారు? ఏం చెపుతున్నారు? ఏం జరుగుతోంది?’ అనేవి పట్టించుకోకుండా అరుపులు కేకలు వేయడం పరిపాటిగా మారింది. మాట్లాడుతున్నా అతిధులను ‘ఇక చాలు వెళ్ళండన్నట్లు’ చేతులతో సైగలు కూడా చేస్తున్నారు. ఇది అతిధులను అవమానించడమే.

కానీ ఇప్పుడు రాజకీయ సభలైనా, సినిమా ఫంక్షన్స్ అయినా ఇలాగే సాగుతున్నాయి. ఇలాంటి ప్రవర్తన మన పట్ల ఇతరులకు దురాభిప్రాయం కలిగిస్తుందనే ఇంగిత జ్ఞానం చాలా అవసరం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Most Controversial Show: Will Allu Arjun Finally Open Up?

For years, Koffee With Karan has become a pop-culture property of its own. Stars came…

14 minutes ago

Cricket Career Almost Over: Now Retired Major Downfall

Yuzvendra Chahal has announced his retirement from first class cricket, bringing an end to his…

33 minutes ago