చంద్రబాబు యోగాసనాలు.. జగన్‌ శుభాకాంక్షలు!

“నేను యువకుడిని మరో 20-30 ఏళ్ళు రాజకీయాలలో ఉంటా. చంద్రబాబు నాయుడుకి వయసైపోయింది. మావిగన్‌ అంటే బీపీ పెరిగి గుండాగి చనిపోతారు. ఆయన రాజకీయ జీవితం చివరి దశకు చేరింది. ఇంక కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేయాల్సిందే,” అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచూ చెపుతుండటం అందరూ వినే ఉంటారు.

కానీ నేను యువకుడిని అని చెప్పుకునే జగన్‌ నేడు యోగా దినోత్సవం రోజున ఎక్కడున్నారు? 76 ఏళ్ళ వయసున్న సిఎం చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు? అని చూస్తే ఇద్దరి మద్య వ్యత్యాసం అర్ధమవుతుంది.

ADVERTISEMENT

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు శనివారం యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ఉండవల్లి గుహల వద్ద యోగాసనాలు వేశారు.

బాబా రాందేవ్‌, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత యోగాసనాలు వేయడంలో పెద్ద విచిత్రం కాదు. కానీ ఈ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు వారితో పోటీ పడుతూ పలు క్లిష్టమైన యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు. బాబా రాందేవ్‌ సైతం సిఎం చంద్రబాబు నాయుడుని ప్రశంశించకుండా ఉండలేకపోయారు.

ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు ఒక చక్కటి మాట కూడా చెప్పారు. రాష్ట్రం, సమాజం అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం ఎంత అవసరమో, మనుషుల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కొరకు ఆధ్యాత్మిక చింతన, యోగా కూడా అంతే అవసరమన్నారు. ఈవిషయం ఎంత మంది చెవికెక్కించుకున్నారో తెలీదు.

మరి నవ యువకుడు జగన్‌ కూడా యోగాదినోత్సవం రోజున యోగాసనాలు వేసి ఉంటే వైసీపీ శ్రేణులు, వారి సొంత, సోషల్ మీడియాకు తమ అధినేత గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం లభించేది. కానీ జగన్‌ వారికావకాశం ఇవ్వలేదు.

‘యోగా చేయడం వలన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని, యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టుతో సరి పెట్టారు.

టెక్నాలజీ విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుని అందుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి, కనీసం నాలుగు యోగాసనాలు వేసి ఆయనతో పోటీ పడగలనని నిరూపించుకుంటే వైసీపీ శ్రేణులు సంతోషించి ఉండేవి కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

November Test: Can Sai Pallavi Survive Double Pressure?

Sai Pallavi is known for being selective with her films. It is rare for her…

13 minutes ago

Rishabh Out: SRH Star In? Test Comeback Loading

Ishan Kishan could be back in India’s Test plans ahead of the upcoming New Zealand…

32 minutes ago