
తను పడ్డ శ్రమకు అదృష్టం కూడా తోడయ్యిందని చెప్పిన చందు, ఆ అదృష్టం ఎంతవరకు అంటే… తన కుటుంబ సభ్యులతో పాటు, తన భార్య తరపు కుటుంబ సభ్యుల నుండి కూడా తనకు ఎంతో సహకారం లభించేదని చెప్పారు. తన భార్య సోదరి సునీత యుఎస్ లో ఉంటుందని, ఆమె పంపించే డ్రెస్సులే నేను ధరించేదని, ‘కార్తీకేయ’ సినిమా విడుదల రోజున కూడా ఆమె యుఎస్ నుండి పంపించిన బ్లాక్ షర్టు పంపించిందని, తన వైఫ్ బ్లాక్ ఎందుకు అని చెప్పాలని కూడా ఆగిపోయిందని, తాజాగా విడుదలైన ‘ప్రేమమ్’ సినిమా విడుదల రోజున కూడా అదే బ్లాక్ డ్రెస్ వేసుకున్నానని, తన విడుదల ‘సక్సెస్’ సెంటిమెంట్ ను బయటపెట్టారు చందు.
“కార్తీకేయ” సినిమా కధను దాదాపు అయిదారుగురు ప్రముఖ హీరోలకు చెప్పానని, అందరూ ఈ పాములతో వర్కౌట్ కాదన్నారని, చివరికి తన స్నేహితుడు నిఖిల్ ఒప్పుకున్న తర్వాత మరో పదిహేను మంది ప్రముఖ నిర్మాతలకు కూడా ఈ కధ చెప్పానని, చివరకు శ్రీనివాసరావు గారు ఒప్పుకున్నారని, తన మొదటి సినిమా సంగతులను తెలిపారు. ‘కార్తీకేయ’ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలలో అల్లరి నరేష్ కూడా ఒకరన్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారు చందు. ఇంకా ఇతర హీరోల పేర్లు బయటపెట్టడానికి… బాగోదులేనని చెప్పలేదు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…