
ఏదైనా ఒక వ్యవహారంలో ఎవరైనా నటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలను ప్రసారం చేయవద్దని, ఇటువంటి వార్తలు పదే పదే ప్రసారం చేయడం వల్ల వారి జీవితాలు నాశనమవుతాయని, అందుకు మీడియా కూడా పరోక్షంగా కారణమవుతుందని అన్నారు. అలాంటి వార్తలు ప్రసారం చేసే వారు డబ్బులు సంపాదిస్తే సంపాదించవచ్చు కానీ, ఒకరిని నాశనం చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్లు తమ కుటుంబసభ్యులకు సంతోషంగా తిండి పెట్టగలరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఎఫైర్స్, సెక్స్ రాకెట్ వంటి కేసుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా నటి పేరు బయట పెడుతూ వార్తలు ప్రసారం చేయవద్దని కోరుకుంటున్నానని, దయచేసి అటువంటి వార్తలు ఆపాలని, తానూ పుష్కరాలలో స్నానం చేస్తుంటే ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడం, దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై హేమ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ పెట్టిన వాడి తల్లి లేక చెల్లి వీడియోలు ఇలాగే అప్ లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? నాకు నలభై ఏళ్ళు వచ్చేసాయి, ఇలా నా మీద ఇలా డబ్బులు సంపాదించడం కన్నా, వారింట్లో వారి మీద డబ్బులు సంపాదించుకోవచ్చు కదా… అంటూ ఒకానొక సందర్భంలో బూతులను కూడా తిట్టేసింది హేమ.
అలాగే పలు వెబ్ సైట్ లలో వస్తున్న ఇంటర్వ్యూల పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది హేమ. అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీలో చేసే కార్యక్రమాలలో నిజం ఉండొచ్చు గానీ, ఆమె ఏ పరిస్థితుల్లో అలాంటి వాటికి ఒప్పుకుంటుందో ఆ రాసే వారికి తెలుసా? బహుశా వారి పొట్టకూటి కోసమో లేక వారి కుటుంబ సభ్యులను బ్రతికించుకోవడం కోసమో అన్నది ఎవరికైనా తెలుస్తుందా? నాకు ఇంత లైఫ్ ని ఇచ్చిన ఇండస్ట్రీ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది, అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు కూడా నాకు ఉందని అంటోంది హేమ.
Allari Naresh is officially back in top form with Ramba Oorvasi Menaka, reminding everyone of…
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…