Telugu

ఏపీలో ఉపాధ్యాయులకు ఛార్జ్ మెమోలు? అన్నీ కొంప ముంచే ఐడియాలే!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, ఉద్యోగుల జాబితాను పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్లు, వివిద శాఖల హెచ్ఓడీలను ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఒక్క విద్యాశాఖ మాత్రం ఇప్పుడు ఇరకాటంలో పడింది.

ADVERTISEMENT

వైసీపి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నందున, వారిని ఎన్నికల విధులకు పంపిస్తే వైసీపికి వ్యతిరేకంగా కుట్ర చేస్తారనే భయపడుతోంది. అందుకే రాష్ట్రంలో ఉపాధ్యాయులందరినీ భోధనేతర పనుల నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదే జీవో జారీ చేసింది. వారికి బదులు తమ నేతల కనుసన్నలలో మెలిగే సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులలో ఉపయోగించుకోవాలనుకొంది.

కనుక ఈసీ ఆదేశం మేరకు విద్యాశాఖ ఉపాధ్యాయుల పేర్లను పంపించవచ్చా లేదా?అని సందేహం వ్యక్తం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవోని తాము పట్టించుకోబోమని, ఉపాధ్యాయులను కూడా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ స్పష్టం చేయడంతో డీఈవోలు ఉపాధ్యాయుల జాబితాను సిద్దం చేస్తున్నారు.

ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచేందుకు ఏడాది కిందటే ప్లాన్ చేస్తే చివరికి ఇలా అవడంతో వైసీపి ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుకొన్నట్లయింది. కనుక ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించేందుకు మరో కొత్త ఐడియా చేస్తోంది.

తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్న ఉపాధ్యాయులకు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ‘ఛార్జ్ మెమో’లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో కనీసం వంద మంది ఉపాధ్యాయులకు సంజాయిషీ కోరుతూ మెమోలు పంపించిన్నట్లు తెలుస్తోంది.

విద్యార్దులకు బైజూస్ పాఠాలు, ఇంగ్లీష్ మీడియంలో భోదన, అటెండన్స్ తీసుకోవడంలో పొరపాట్లు, విద్యార్దుల హోమ్ వర్క్ పుస్తకాలు దిద్దడం, పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగదుల పారిశుద్యత పాటించడంలో అలసత్వం వంటి కుంటిసాకులతో ఉపాధ్యాయులకు ‘ఛార్జ్ మెమో’లు పంపిస్తున్నట్లు సమాచారం. వాటిని ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి.

తద్వారా వారిని ఎన్నికల విధులకు అనర్హులుగా చేసి దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపి ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులను నమ్మలేదు. ఉపాధ్యాయులను నమ్మలేదు. ఓటర్లపై నమ్మకం లేక జాబితాలను తారుమారు చేస్తోంది. చివరికి సంక్షేమ పధకాలు పొందుతున్న లబ్ధిదారులను కూడా నమ్మడం లేదు. మరి ఎవరిని నమ్ముకొని ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకోవాలనుకొంటోందో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

43 minutes ago

AP Civic Polls: TDP Gets 11 Corporations, Jana Sena 4, BJP 2

The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…

58 minutes ago