
ఆయన తన సాటి మంత్రులకి కూడా తెలియని మరో విషయం కూడా చెప్పారు. రాజధానితో ఏ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావని ప్రభుత్వం పనితీరు చూసే వస్తాయని చెప్పారు. కనుక విశాఖలో రాజధాని ఏర్పాటుకి, పెట్టుబడులు, పరిశ్రమలు రావడానికి ఎటువంటి సంబందం లేదని తేల్చి చెప్పేసినట్లే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే సిఎం జగన్ మూడు రాజధానులతో పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకి పూనుకొన్నారని, సాహసోపేతంగా ఆయన తీసుకొంటున్న నిర్ణయాలు, పనితీరుని చూసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా ప్రవహిస్తున్నాయని మంత్రి చెల్లుబోయిన చెప్పారు.
ఏపీకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చిపడుతుంటే నేటికీ యువత హైదరాబాద్, బెంగళూరు నగరాలకి ఎందుకు వలసలు పోతున్నారు? రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నా, ఐటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నా రాష్ట్ర వృద్ధిరేటు, జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం అన్ని ఎలా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి?ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది? తిరిగి వారి ఖాతాలలో సొమ్ము ఎందుకు తీసి వాడుకొంటోంది? కేంద్రం ఇస్తున్న పంచాయతీ నిధులని ఎందుకు పక్కదారి పట్టిస్తోంది? నెలనెలా ఎడాపెడా ఎందుకు ఎప్పులు చేస్తోంది?అనేవి జవాబు దొరకని భేతాళ ప్రశ్నలే కదా?వీటికి సమాధానం చెప్పాలంటే వైసీపీలో ఎవరికీ మొహం చెల్లబోదు!
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…