Telugu

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా రివ్యూ: త్యాగం తడబడగా, ప్రేమ పలుచబడింది!

చిత్రం: చెన్నై లవ్ స్టోరీ

M9 రేటింగ్: 2.25/5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూలై 24, 2026

తారాగణం: శ్రీగౌరి ప్రియ, కిరణ్ అబ్బవరం, అరుణ్ ఆదిత్ తదితరులు

నిర్మాణ సంస్థ: మాస్ మూవీ మేకర్స్ – అమృత ప్రొడక్షన్స్

దర్శకత్వం: రవి నంబూరి

సంగీతం: మణిశర్మ

నిర్మాత: శ్రీనివాస కుమార్ (ఎస్కేన్) – సాయిరాజేష్ నీలం

ఛాయాగ్రహణం: విశ్వాస్ డానియల్

కూర్పు: సంతోష్ నాయుడు

“బేబీ” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయిరాజేష్ రచించగా, ఎస్కేన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇది క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ విశేషంగా ప్రమోట్ చేశారు టీమ్. మరి వాళ్ళు క్రియేట్ చేసిన హైప్ & ఎక్స్ పెక్టేషన్స్ కి సినిమా రీచ్ అయ్యిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ:

మూడేళ్ల ప్రేమ దాదాపుగా పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవడంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది నివేదిత (శ్రీగౌరి ప్రియ). దాంతో తాగుడుకి బానిసై ఏదో ప్రపంచంలో ఉంటూ, బ్రతకు మీద ఆశ లేకుండా బ్రతుకుతుంటుంది.
సినిమా మీద పిచ్చి తప్ప ఏమాత్రం అవగాహన లేని స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) హైదరాబాద్ లో తన కథలు ఎవరూ వినడం లేదని, బ్యాగ్ & టేప్ రికార్డర్ పట్టుకొని చెన్నై వచ్చేస్తాడు.
ఒకానొక సందర్భంలో వీరిద్దరూ కలవడం, ఆ కలయిక గౌరవప్రదమైన స్నేహానికి, ఆ స్నేహం పెళ్లికి, ఆ పెళ్లి కాస్త ప్రేమకి దారి తీస్తాయి. కానీ.. అన్నీ అనుకున్నట్లుగా జరగవు కదా. అందుకే కథలో ట్విస్ట్ & ట్రాజడీ కలిసి వస్తాయి.
ఆ తర్వాత నివి-స్టీవెన్ ల ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? ఆ ట్విస్ట్ ఏంటి? అది ఈ ప్రేమను ఎలా ఎఫెక్ట్ చేసింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “చెన్నై లవ్ స్టోరీ” చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

సాధారణంగా ప్రతి సినిమాకి హీరో గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కానీ.. ఈ సినిమాకి మాత్రం ఎక్కువగా వినిపించే పేరు శ్రీగౌరీ ప్రియ. నివేదిత అనే పాత్రలో జీవించేయడమే కాదు, ఆ పాత్రను ఓన్ చేసుకొని బిహేవ్ చేసింది. స్మశాన వాటికలో, బీచ్ లో ఆమె నటన చూస్తే.. ఒక తెలుగమ్మాయి ఎంత చక్కగా నటిస్తూ తన డైలాగులు తానే చెప్పుకుంటుంది అని మురిసిపోతాం. ఈ సినిమాతో ఆమె కచ్చితంగా స్టార్ హీరోయిన్ కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తుంది.
కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాడు. ప్రొడ్యూసర్ కి కథ చెప్పి వచ్చాక తన ప్రయాణం గురించి చెప్పే సన్నివేశం, సెకండ్ హాఫ్ లో అతని పేరుకి జస్టిఫికేషన్ సీన్ లో హావభావాలను కళ్ళతో ప్రలికించిన తీరు ప్రశంసార్హం ఇప్పటివరకు కిరణ్ అంటే.. ఏదో అల్లరి నటన అనే మార్క్ ని ఈ సినిమాతో మార్చుకున్నాడు. సరైన ఎమోషన్ పడితే మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదు అని ప్రూవ్ చేసుకున్నాడు.
అరుణ్ ఆదిత్ స్క్రీన్ ప్రెజన్స్ & నటన బాగున్నప్పటికీ.. అతడి క్యారెక్టర్ కి ఒక క్లారిటీ లేదు. ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు అనిపిస్తుంది తప్ప, ఆ పాత్రతో జనాలు కనెక్ట్ అయ్యేలా ఆర్క్ రాసుకోలేదు. మిగతా పాత్రధారులు రెగ్యులర్ టెంప్లేట్ రోల్స్ అనిపించాయి తప్పితే ఫ్రెష్ నెస్ కనిపించలేదు.

సాంకేతికవర్గం పనితీరు:

మణిశర్మ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎసెట్. సాయిరాజేష్ రాసుకున్న సన్నివేశాల్ని, ఎమోషన్స్ ని.. రవి నంబూరి తెరకెక్కించిన విధానాన్ని చాలా నెమ్మదిగా, ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా తన నేపథ్య సంగీతంతో మ్యాజిక్ చేశారు మణిశర్మ. పాటలు కూడా అర్థవంతంగా ఉన్నాయి. వాటి సాహిత్యం విషయంలో అనంత్ శ్రీరామ్ తీసుకున్న జాగ్రత్త, రాసిన సాహిత్యం ఆకళింపు చేసుకునేలా ఉండడం ప్రశంసార్హం.
విశ్వాస్ డానియన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. పాత్రధారుల్ని వీలైనంత సహజంగా చూపించాడు. కలరింగ్ & డిఐ విషయంలో మంచి కేర్ తీసుకున్నాడు. ఎడిటింగ్ ఫార్మాట్ & ట్రాన్సిషన్ బాగున్నాయి.
రచయితగా సాయిరాజేష్ నుండి “బేబీ” తర్వాత వస్తున్న సినిమా కావడంతో మామూలుగానే మంచి అంచనాలు ఉంటాయి. కానీ సాయిరాజేష్ వాటిని పూర్తిస్థాయిలో అందుకోలేకపోయాడు. సెకండాఫ్ లో హీరో క్యారెక్టర్ ప్రదర్శించే పొసెసివ్ నెస్ అనేది ఎమోషన్ ను హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడు. అలాగే.. ఆ ప్రేమలోని నాకే సొంతం అనే భావన త్యాగానికి ఎలా మారింది అనేది సన్నివేశాల రూపంలో కనిపించింది కానీ.. ఆడియన్స్ ఫీల్ అయ్యే లేదా కనెక్ట్ అయ్యే స్కోప్ ఇవ్వలేదు. ఆ కారణంగా చివర్లో ఇచ్చిన క్లోజర్ కు వేల్యూ యాడ్ అవ్వలేదు. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.
దర్శకుడు రవి నంబూరి సీన్ కంపోజిషన్స్ విషయంలో పెట్టిన శ్రద్ధ మంచి ఫలితాన్ని ఇచ్చింది. చాలా సీన్స్ కొత్తగా కనిపించాయి. కిరణ్ అబ్బవరం సినిమా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు టీ కప్పు సీన్, ఒక ఫెయిల్యూర్ ని కిరణ్ సెలబ్రేట్ చేసుకునే సీన్, హీరోయిన్ బాధని ఫీల్ అయ్యే సీన్ వంటివి బాగా తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే చేపల చిట్టి కథ మంచి అనుభూతినిచ్చింది. అయితే.. సెకండాఫ్ లో వచ్చే స్వార్థం అనే ఎమోషన్ ను డీల్ చేయడంలో మాత్రం కాస్త గట్టిగానే తడబడ్డాడు. అందువల్ల.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. అయితే.. దర్శకుడిగా తొలి ప్రయత్నంలో పర్వాలేదనిపించుకున్నాడు. డైలాగ్స్ విషయంలోనూ కాస్త నవ్యత చూపించాడు.

విశ్లేషణ:

ఒక ప్రేమకథ గోల్ ఏమిటి? కథగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి ఎమోషన్ ను ఎలివేట్ చేయాలి అనుకుంటున్నారు? అనేది క్లియర్ గా ఉండాలి. “చెన్నై లవ్ స్టోరీ” చాలా క్లియర్ గా మొదలై, సెకండాఫ్ లో కథను ఎటువైపు తిప్పాలో అర్థం కాక, కొత్తగా చూపించాలి అనే ప్రయత్నంలో వచ్చే పొసెసివ్ నెస్ అనే థీమ్ అప్పటివరకు సినిమా బిల్డ్ చేసిన ఒక పాజిటివిటీని డ్యామేజ్ చేసింది. ఇక తర్వాత వచ్చే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కన్వీనియెంట్ గా ఉంటాయి తప్పితే ఎగ్జైట్ చేసేలా ఉండవు. ఆ కారణంగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా శ్రీగౌరి ప్రియ, కిరణ్ అబ్బవరంల అద్భుతమైన పెర్ఫార్మెన్సులు, మణిశర్మ వినసొంపైన-అర్థవంతమైన సంగీతం ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని అలరించడంలో తడబడింది.

ఓవరాల్ గా.. త్యాగం తడబడగా, ప్రేమ పలుచబడింది!

M9 రేటింగ్: 2.25/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

3 hours ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

4 hours ago