
కన్నడంలో “మమ్మీ” పేరుతో రూపుదిద్దుకుంటున్న సినిమాను తెలుగులో “చిన్నారి” పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను ప్రముఖ దర్శకుడు మారుతీ విడుదల చేసారు. రెగ్యులర్ గా వచ్చే హార్రర్ సినిమాలతో పోలిస్తే ఈ టీజర్ కాస్త మెరుగనిపించే విధంగా ఉందని చెప్పవచ్చు. చిన్న పిల్లతో కూడుకున్న సబ్జెక్ట్ కావడంతో, ప్రేక్షకులకు ఫ్రెష్ నెస్ ను పంచడంలో సక్సెస్ సాధించింది ఈ టీజర్.
దీనికి తోడు ఒక్క ప్రియాంక మినహా నటీనటులు అంతా కొత్తవారు కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అవుతుంది. టీజర్ కు అందించిన అజినీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, కట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. గోవా నేపధ్యంలో సాగే ఈ కధ నిజ జీవితపు ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించారు. నవంబర్ లో ఈ “చిన్నారి” హార్రర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది చిత్ర యూనిట్.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…