Telugu

చిరు 151 ఫిక్స్… స్టైలిష్ గా మెగాస్టార్..!

‘ఖైదీ నంబర్ 150’ ఇచ్చిన ఉత్సాహంతో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న వైనం తెలిసిందే. లైన్ లో సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, పూరీ జగన్నాధ్, క్రిష్ వంటి దర్శకులు ఉండగా, తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో నెలకొని ఉంది. అయితే తాజా సమాచారం మేరకు మెగాస్టార్ 151వ సినిమా ఫిక్స్ అయ్యిందని… దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని తెలుస్తోంది.

రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా చూసిన తర్వాత, చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయాలని ఉందన్న ప్రకటనను చేసిన చిరు, ఇపుడు దానినే కార్యరూపం సిద్ధించుకోబోతున్నారని తెలుస్తోంది. అవును… సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 151వ సినిమా రూపుదిద్దుకోబోతుందని దాదాపుగా ఖరారైన విషయం. ఈ సినిమాకు ‘ధృవ’ సంగీత దర్శకుడు హిప్ హాప్ నే స్వరాలు సమకూర్చబోతున్నారని సమాచారం.

ADVERTISEMENT

హీరోలను అత్యంత స్టైలిష్ గా చిత్రీకరించడంలో సిద్ధహస్తుడైన సురేందర్ రెడ్డి, ‘ధృవ’ సినిమాతో ఏకంగా రామ్ చరణ్ నే అద్భుతంగా చూపించారు. అలాంటిది ఇక ఆ స్థానంలో మెగాస్టార్ ఉంటే… అవును మెగా అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా చిరుని ‘స్టైలిష్’గా ప్రజెంట్ చేయబోతున్నారని, ఈ సినిమాలో చిరుని చూడడానికే ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చేలా చూపించబోతున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Riya Suman Owns The Sunset In Sultry Coastal Style

Riya Suman knows how to make golden hour look like her own fashion runway. Against…

31 minutes ago

AK47 US BO Day 2: Decent Hold, Nears $1 Million

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…

1 hour ago