
ప్రజారాజ్యం విలీనం తరువాత రాజకీయాలకు కొంచెం కొంచెం దూరం జరుగుతూ సినీ ఇండస్ట్రీ కి మళ్ళీ దగ్గరైన మెగాస్టార్ చిరంజీవి తనకు రాజకీయాల పై ఆసక్తి లేదంటూ ఖరాకండిగా తెగేసి చెప్పారు.
ఈ నేపథ్యంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు తెలుపుతారా.? లేదా అంటూ పలు చర్చలు జరిగినప్పటికీ అధికారికంగా మెగా కుటుంబం నుండి జనసేనకు 2024 వరకు ఎటువంటి మద్దతు కానీ జనసేనకు సపోర్ట్ గా ఒక స్టేట్ మెంట్ గాని దక్కలేదు.
అయితే తమ్ముడు ఎదుగుదలను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానని, పవన్ ఎదో ఒక రోజు తానూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడనే నమ్మకం నాకుందని, అందుకు నా ఆశీస్సులు ఎప్పుడు నా తమ్ముడికి ఉంటాయంటూ పరోక్షంగా తమ్ముడు క్షేమం కోరుకునే ఒక అన్నగా స్పందించారే కానీ పార్టీకి ఎటువంటి సాయం అందించలేదు.
పవన్ ఆదేశిస్తే, కోరుకుంటే జనసేనకు, పవన్ కు అవసరమైన సాయం అందించడానికి మేమంతా ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం అంటూ మెగా హీరోలు ప్రకటనలకు పరిమితమయ్యారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్థికంగా జనసేనకు అండగా ఉండడానికి ప్రత్యక్ష సాయం అందించారు మెగాస్టార్ చిరంజీవి.
పోచంపల్లి లో జరుగుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ సెట్లో చిరుని కలిసిన పవన్, నాగబాబు కు చిరు జనసేన కోసం 5 కోట్ల ఆర్థిక సాయం అందించారు. చిరు సాయాన్ని అందుకున్న పవన్ అన్న కాళ్లకు నమస్కరించి చిరు ఆశీస్సులు తీసుకున్నారు. దీనితో ఇన్నాళ్లుగా మెగాస్టార్ మద్దతు పవన్ కు ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎట్టకేలకు తెర పడింది.
వైసీపీ విముక్త ఏపీకి చిరంజీవి కూడా తమ్ముడికి తోడుగా తనవంతు సాయం అందించారు అంటూ మెగా ఫాన్స్ ఈ వీడియో ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి చిరంజీవిని టార్గెట్ చేస్తూ వైకాపా నాయకుల విమర్శల మోత మొదలవ్వడం ఖాయంగా కనపడుతుంది.
పవన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు అందరి హీరోలతో స్నేహ సంబంధాలు ఉన్నాయని, వారందరి పైన తనకు గౌరవం, ప్రేమ ఉన్నాయని, వచ్చే ఎన్నికలలో సినిమా పరంగా విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరి హీరోల అభిమానులు ఏపీ పునర్నిర్మాణానికి సాయం అందించాలంటూ అందరి హీరోల అభిమానులను తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…