
సంక్రాంతి పందెంలో చిరంజీవి బాలకృష్ణ ల మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. ఇద్దరి సినిమాలూ పక్క పక్కన థియేటర్లలో పడితే ఇక అక్కడ జాతరే. పండుగ వాతావరణంలో, అభిమానులు కేరింతలతో సంక్రాతి రోజు ఈ మాస్ హీరోల సినిమాలు చూస్తే వచ్చే మజాయే వేరు. సంక్రాంతి పందెంలో ఎక్కువగా బాలకృష్ణకు విజయాలు దక్కగా, చిరంజీవికి అప్పుడప్పుడు హిట్లు వచ్చేవి. అయినా ఇద్దరి మధ్యా పోటీ ఆగేది కాదు.
ఈ మధ్య కాలం లో సంక్రాంతి పోటీలో ఈ ఇద్దరి హీరోల సినిమాలు పోటీ పడలేదు. 2023 సంక్రాంతికి అటువంటి పోటీ మళ్ళీ వచ్చేదే. నటసింహం బాలకృష్ణ 107 వ సినిమా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో పోటీ పడాల్సి ఉంది. ఇప్పటికే బాలయ్య ఊర మాస్ టీజర్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచేశారు. క్రాక్ సినిమా తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా అవ్వడం బాలయ్య అభిమానుల్లో నమ్మకాన్ని పెంచింది. ఒక వైపు చాలా రోజుల తరువాత తెలుగులో నేరుగా చిరంజీవి చేస్తున్న సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. రవితేజ ఈ సినిమాలో అతిధి పాత్ర పోషించడం ఈ సినిమాలో ఆకట్టుకునే అంశం. దర్శకుడు బాబీ తొలిసారిగా మెగాస్టార్ ని ముఠామేస్త్రి తరహా మాస్ పాత్రలో చూపిస్తున్నాడని సమాచారం.
బాలయ్య 107 – వాల్తేర్ వీరయ్యల మధ్య సంక్రాంతి పోటీ తధ్యం అనుకుంటున్న సమయంలో..ఈ రెండు సినిమాల్ని ఒకే సంస్థ మైత్రి మూవీస్ నిర్మించడం వలన, ఈ సంక్రాంతి పోటీ లో ఎదో ఒక సినిమా తప్పుకోవాల్సిందే. ఎన్నో సార్లు సంక్రాంతికి పోటీ పడ్డ బాలయ్య – చిరుల సినిమాలు ఈ సంక్రాంతికి పోటీపడకపోవడం సినీ ప్రేక్షకులకు నిరాశే! పోటీ కనుక పడి ఉంటేనా..బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ అదిరిపోతాయి. థియేటర్లు కళకళ లాడిపోతాయి. జస్ట్ మిస్ అంతే!
ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ కూడా సినిమాలు నిలద్రొక్కుకునేందుకు తోడ్పడుతుంటుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో టీడీపి-జనసేన సీట్ల సర్దుబాట్లు, వాటిపై వినిపిస్తున్న…
Prabhas and director Sandeep Reddy Vanga have come together for the first time for the…