
Jana Sena Rebels Draw Sympathy in AP Polls
ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ కూడా సినిమాలు నిలద్రొక్కుకునేందుకు తోడ్పడుతుంటుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో టీడీపి-జనసేన సీట్ల సర్దుబాట్లు, వాటిపై వినిపిస్తున్న అసమ్మతి స్వరాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న భీకర యుద్ధాలు, తిరుగుబాట్లు, రెబెల్ అభ్యర్ధులుగా నామినేషన్స్ వంటివన్నీ కూడా జనసేనకు కలిసి రావచ్చు.
టీడీపి ఒత్తిళ్ళకు తలొగ్గి జనసేన అధిష్టానమే పార్టీ శ్రేణులకు అన్యాయం చేసిందనే వాదనలు సోషల్ మీడియాలో, క్షేత్రస్థాయిలో కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.
కనుక జనసేన తరపున పోటీ చేస్తున్నవారి కంటే, రెబెల్ అభ్యర్ధులుగా పోటీకి దిగుతున్నవారిపై ప్రజలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో చాలా సానుభూతి ఏర్పడింది. అది వారిని ఈ ఎన్నికలలో గెలిపించవచ్చు.
వైసీపీకి చెందిన కొందరు, జనసేన శ్రేయోభిలాషుల ముసుగులో వారి కోసం సోషల్ మీడియాలో కార్చిన మొసలి కన్నీళ్ళు కూడా వారికి మరింత సానుభూతి సంపాదించి పెట్టాయని చెప్పవచ్చు.
కనుక ఈ ఎన్నికలలో జనసేన+రెబెల్ అభ్యర్థులు కలిపి మళ్ళీ వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వైసీపీ కూడా ఊహించలేని పరిణామం కావచ్చు.
అయితే ఎన్నికల సమయంలో జనసేన అధిష్టానం వ్యవహరించే తీరు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని మరోసారి నిరూపించుకుంది.
కనుక పవన్ కళ్యాణ్ నాయకత్వంపై జన సైనికుల అచంచల విశ్వాసం సడలే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఆయన తీరుపై తీవ్ర అసహనంగా ఉంది. కనుక జనసేనాని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టడం, తదుపరి స్థానిక ఎన్నికలలో జన సైనికులకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం.
లేకుంటే దీర్గ కాలంలో జనసేనకు జరిగే నష్టం ఊహించడం కష్టం. ‘సైకిల్’ చైనులో ఒక్క లింక్ బలహీనపడినా ముందుకు సాగడం కష్టమవుతుంది. కనుక టీడీపి తన రాజకీయ భవిష్యత్తో పాటు జనసేన భవిష్యత్ గురించి కూడా ఆలోచించడం చాలా అవసరం.
Prabhas and director Sandeep Reddy Vanga have come together for the first time for the…
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…