Telugu

చిరంజీవి స్టామినా బయటపెట్టే సినిమాలివి కాదు

దశాబ్దాల తరబడి స్టార్ స్టేటస్ అనుభవించిన హీరోలకు ఫాలోయింగ్ తో పాటు సమానమైన మోతాదులో తాము చేస్తున్న సినిమాల్లోని అంశాల పట్ల అంతే బాధ్యత ఉంటుంది. కెరీర్లో పైకొస్తున్న దశలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, అభిమానుల అంచనాలకు తగ్గట్టు మాస్ చిత్రాలు ఎన్నయినా చేసుండొచ్చు. కోట్ల రూపాయల వసూళ్లు, పారితోషికాలు కళ్లజూసి ఉండొచ్చు.

కానీ అదంతా ఒక దశ వరకే పరిమితం కావాలి. వయసు పరిమితుల దృష్ట్యా కొత్త తరానికి సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి. అందులోనూ చిరంజీవి లాంటి దిగ్గజాలు సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమిది. సంక్రాంతి సీజన్ వల్ల వాల్తేరు వీరయ్య గట్టెక్కింది. ఇందులో అనుమానం లేదు. ఓటిటిలో వచ్చాక సోషల్ మీడియాలో దీని ప్రస్తావనే లేకపోవడం కన్నా సాక్ష్యం అక్కర్లేదు.

ADVERTISEMENT

ఇప్పుడు తిరిగి అదే టెంప్లేట్ లో భోళా శంకర్ తో వస్తున్నారు. వేదాళం అనే రొట్ట రొటీన్ తమిళ కథతో రాబోతున్న రీమేక్ ఇది. స్వయానా ఫ్యాన్స్ లోనే ఈ సినిమాపై నెగిటివిటీ ఉంది. దీనికి తోడు డిజాస్టర్ దర్శకుడు మెహర్ రమేష్ బ్రాండ్. టీజర్ చూశాక అవే పాత కాలం మ్యానరిజంలు, ఛాలెంజులు, సూటు బూటు వేసుకున్న విలన్లతో ఓవర్ టాప్ హెలి ప్యాడ్ ఫైట్లు, అదనంగా హీరోయిన్ తో డ్యూయెట్లు వగైరా. ఇంతకన్నా కొత్తదనం ఏమీ కనిపించడం లేదు.

చిరంజీవి లాంటి లెజెండరీ స్టార్లు తమలోని అసలైన నటుడిని బయటికి తీసుకురావాల్సిన సమయమిది. రుద్రవీణ టైంలో రిస్క్ జరిగింది కాబట్టి ఫలితం రాలేదు నిజమే. కానీ ఇప్పుడలాంటి ఇబ్బందులు లేవు. బడ్జెట్ లు, పారితోషికాలు తగ్గించుకుని ప్రయోగాలు చేస్తే హిట్టయినా ఫ్లాప్ అయినా ఫిల్మోగ్రఫీకి మరింత విలువ తోడవుతుంది. థియేట్రికల్ గా ఆడకపోయినా శాటిలైట్లు, ఓటిటిలు మంచి ఆదాయాన్ని ఇస్తాయిగా. అమితాబ్ చేస్తోంది ఇదే.

ఏడు పదుల వయసు దగ్గరలో చిరంజీవి ఇప్పుడు స్వయంకృషిలు ఆపద్బాంధవుడులు చేయాలి. ఫోర్ జి జెనరేషన్ కు తన గొప్పదనం తెలిపే సవాళ్లు స్వీకరించాలి. సాయిశ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోలు చేసేదే మనమూ చేస్తున్నప్పుడు తేడా ఎలా కనిపిస్తుంది. భారతదేశపు మూడవ అత్యున్నత పురస్కారం అందుకున్న మెగాస్టార్ లోని అసలైన యాక్టర్ ని నలభై సంవత్సరాల తర్వాత కూడా చూసే అవకాశం దక్కకపోతే ఎలా.

ఇప్పుడు హద్దులు చెరిపేసుకోవాలి. తండ్రిగానే కాదు తాతయ్యగా నటించాల్సి వచ్చినా సై అనాలి. ఇది కదా చిరంజీవని అభిమానే కాదు సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా గర్వపడే పాత్రల్లో కనిపించాలి. ఆ దిశగా దర్శకుల కన్నా ముందుగా సంసిద్ధం కావాల్సింది మెగాస్టారే. లేకపోతే ఈ మూస మసాలాలు ఎన్ని చేసినా నిర్మాతల జేబులు నిండటమే తప్ప ఆయనలోని నటతృష్ణ ఎప్పటికీ తీరదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth Forced Jailer 2? Will Nelson Escape Blame?

Following the terrible failure of Coolie, Rajinikanth is all set to return with his next…

28 minutes ago

Karan Johar’s Koffee Exit with Shocking SRK-Aryan Twist

Koffee with Karan may be ending but Karan Johar is not ready to say goodbye…

58 minutes ago