
రాజకీయ రంగం వైపు నుండి మళ్ళీ సినీ రంగంలోకి ప్రవేశించిన చిరంజీవి, రెగ్యులర్ గా సినిమాలు చేస్తారని ఇటీవల రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే బోయపాటికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని, ఓ మాంచి మాస్ మసాలా కధను సిద్ధం చేస్తున్నట్లుగా సినీ వర్గాలలో హల్చల్ చేస్తున్న టాక్. ‘సరైనోడు’తో అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ ను అందివ్వడంతో మెగాస్టార్ నుండి వెంటనే ‘ఓకే’ అనిపించుకోవడంలో బోయపాటి విజయవంతం అయ్యారని సారాంశం.
చిరు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న బోయపాటితో గీతా ఆర్ట్స్ సంస్థ మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తోందని, ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయంటూ మరో టాక్. ఏది ఏమైనా… ఒక్కసారి మెగా హీరోలను ఓ రౌండ్ వేసే విధంగా స్కెచ్ వేసుకున్నట్లున్నారు బోయపాటి. మెగా క్యాంప్ లోకి అడుగుపెట్టిన బోయపాటి మళ్ళీ ఎప్పుడు నందమూరి హీరోలతో జత కడతారో చూడాలి.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…