Telugu

చిరంజీవికి కరోనా పాజిటివ్, మొదలు గాక ముందే ఆగిన ఆచార్య

ఇప్పుడిప్పుడే చలన చిత్ర పరిశ్రమ గాడిలో పడుతుంది అనుకుంటుండగా మరో షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. కాసేపటి క్రితం ఆయనే దానిని స్వయంగా నిర్థారించారు. ఈరోజు ఆయన తన తదుపరి చిత్రం ‘ఆచార్య’ మొదలుపెట్టాల్సి ఉండగా షూటింగ్ ఇప్పుడు మరోసారి ఆగిపోయింది.

“ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను,” అని చిరంజీవి ట్విట్టర్ లో తెలిపారు.

ADVERTISEMENT

చిరంజీవి చివరిసారిగా శనివారం పబ్లిక్ లో కనిపించారు. ఆరోజు మధ్యాహ్నం ఆయన నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. అదే రోజు సాయంత్రం ఆయన రఘు కుంచె కుమార్తె వివాహానికి హాజరయ్యారు. రెండు సందర్భాలలోనూ ఆయన మాస్కు లేకుండానే కనిపించారు.

దీనితో రెండు సందర్భాలలో ఆయన తో కాంటాక్ట్ లోకి వచ్చిన వారు టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు, సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి ఆవశ్యకతని ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

అయ్యో పాపం చెవిరెడ్డి… పులివర్తి సుధా రెడ్డి ర్యాగింగ్!

నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి…

13 minutes ago

Sudha Reddy, Chevireddy Face Off Amid Chandragiri Polls

The exchange between Pulivarthi Sudha Reddy and former MLA Chevireddy Bhaskar Reddy during the parishad…

32 minutes ago