‘చిరు’ తనయురాలి వివాహంతో ‘మెగా’ ఫ్యాన్స్ నిరాశ!

అభిమానులను ఉద్దేశించి చిరంజీవి ఏ విధంగా ప్రసంగిస్తారో అందరికీ తెలిసిందే. తన జీవితంలో అభిమానులకు ఓ ప్రత్యేక స్థానముందంటూ వివిధ సందర్భాలలో మెగాస్టార్ చేసిన ప్రకటనలు మెగా ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. దానికి తగిన విధంగానే తన ఇంటి వేడుక అయినా గానీ, అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించిన సందర్భాలు ఉన్నాయి.

ముఖ్యంగా చిరంజీవి మొదటి కూతురు సుష్మ, అలాగే రామ్ చరణ్ వివాహాల సమయంలో అభిమానుల ఆశీర్వాదం కోరుతూ ఒక రోజు ఫ్యాన్స్ కు భోజనాలు ఏర్పాటు చేసి కొత్త జంటలను దీవించమని కోరారు. అయితే చిన్న కూతురు శ్రీజ ప్రేమ పెళ్లి నిర్వాకంతో తల దించుకున్న చిరు, మళ్ళీ ఆమెకు వివాహం నిర్ణయించిన విషయం తెలిసిందే. అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ… శ్రీజ క్లాస్ మేట్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కుమారుడితో నిశ్చయమైనట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం బయటకు పొక్కింది.

ADVERTISEMENT

ఈ వివాహానికి చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని, ఇటీవల ప్రత్యేకంగా హైదరాబాద్ విచ్చేసి మరీ సంప్రదింపులు జరిపారని కూడా తెలిసింది. అయితే, అభిమానులకు నిరుత్సాహం కలిగించే అంశమేమిటంటే… సుష్మ, చెర్రీల మాదిరి శ్రీజ వివాహా వేడుకను పబ్లిక్ ఈవెంట్ లా కాకుండా, కేవలం ఒక ప్రైవేటు వ్యవహారంలా జరిపిస్తున్నారు.

కేవలం చిరు కుటుంబ వర్గీయులతో పాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొనబోతున్నారట. ఫిబ్రవరి 1వ తేదీన జరిగిన నిశ్చయ తాంబూలాల వేడుక కూడా ఇలాగే జరిగిందని, అలాగే ఈ నెల 25వ తేదీన జరగబోతున్న వివాహం కూడా ఇలాగే జరగబోతుందని తెలుస్తోంది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సారి తమకు అవకాశం దక్కనందుకు మెగా అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు.

Share
Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

13 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

18 minutes ago