
అయితే నిన్న జరిగిన గాడ్ ఫాదర్ విజయోత్సవ సభలో సినిమాకి పని చేసిన కొంతమంది టెక్నీషియన్స్ ఒకవైపు మెగాస్టార్ మీద ప్రేమను ఒలకబోస్తూ, గరికపాటి గారి మీద విషం వెళ్లగక్కారు. స్టేజి ఎక్కితే నోరును అదుపులో పెట్టుకోలేని కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు గరికపాటి లాంటి పండితుడు ని పట్టుకుని “వాడు వీడు” అని సంబోధించడం చూస్తే అప్పటి దాకా చిరంజీవి మీద ఉన్న సానుభూతి కాస్తా వీళ్ళు పని గట్టుకుని పోగొట్టారా అనిపించక మానదు. . ఆ తరువాత స్టేజి మీద తక్కువ మాట్లాడే బాబీ కూడా గరికపాటి గారి మీద నోరు పారేసుకున్నాడు. స్టేజి ఎక్కితే ప్రాసలతో చంపేసే రచయిత అనంత శ్రీరామ్, గరికపాటిగారిని గరికతో పోల్చారు. అప్పుడు చెప్పిన సీత కథ లో చిరంజీవిని రాముడిలా పోల్చారు. ఇవన్నీ మెగాస్టార్ చూస్తూ నవ్వుతూ నమస్కరించారంతే.
సినిమా టికెట్స్ రేట్స్ పెంచే విషయం లో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి వెళ్ళినపుడు, జగన్ దగ్గర వినయంతో చేతులు కట్టుకుని నిలబడి అభ్యర్ధిస్తున్నపుడు, మెగాస్టార్ దీన స్థితిని చూసి అభిమానులు అవమానంతో చాలానే మనస్తాపం చెందారు. ఆ సమయం లో ఈ మెగా ఫాన్స్ చోటా, అనంత శ్రీరామ్, బాబీ లాంటి వారు ఎక్కడున్నారు? వీళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవాలా…
అక్కడున్నది ముఖ్యమంత్రి జగన్ కాబట్టి ఆయనంటే భయం కాబట్టి వీళ్లంతా నోటి మీద వేలేసుకున్నారా? ఇప్పుడు ఇక్కడ గరికపాటి లాంటి పండితుడిని వాడు వీడు అని ఇష్టమొచ్చినట్లు దుమ్మెత్తి పోస్తున్నా ఇవన్నీ చూస్తూ కూడా మెగాస్టార్ సైలెంట్ గా చూస్తూ కూర్చున్నారు ఈవెంట్ లో.
సినిమావాళ్లూ మారరు! అభిమానులూ మారరు! ఇద్దరూ.. ఇద్దరే!
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…