
అలయ్ బలయ్ అనే కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహించారు. అక్కడికొచ్చిన గరికపాటి నరసింహారావు గారు ప్రసంగిస్తుండగా, పక్కనే చిరంజీవి అందరితో సెల్ఫీలు దిగుతున్నారు. కెమెరా క్లిక్కుల శబ్దాలకో లేక మెగా అభిమానులు చేస్తున్న అల్లరికో..గరికపాటిగారికి చిరాకొచ్చింది. వెంటనే ఫోటో సెషన్ ఆపితే తాను ప్రసంగాన్ని కొనసాగిస్తానని, లేకపోతే వెళ్లిపోతానని కోపంగా.. చిరంజీవిని రమ్మని అరిచారు గరికపాటి గారు. దేహం మీద మోజు పెంచుకోకూడదని, పెంచుకుంటే ఎందుకూ పనికిరాకుండాపోతారని గరికపాటి మెగా ఫాన్స్ పై సెటైర్ వేశారు.
చిరంజీవి కొంచం ఫీల్ అయినట్లు కనపడినా, గరికపాటి గారి మీద గౌరవంతో ఆయనను క్షమాపణ అడిగి, అయన ప్రవచనాలు చాలా ఇష్టమని చాలారోజులకు ఆయనను కలిసే సందర్భం వచ్చిందని చెప్పారు. అయితే మెగాస్టార్ పై కోపగించుకున్న గరికపాటివారి ప్రవర్తన నచ్చని తమ్ముడు నాగబాబు మెగాస్టార్ పై కురుస్తున్న అభిమానాన్ని చూసి ఓర్వలేక గరికపాటి వారు అక్కసు బయటకి వెళ్లగక్కారు అని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసారు. కందకు లేని దురద చేమకొచ్చిందని, మెగాస్టార్ కి లేని బాధ నాగబాబుకెందుకు? అయినా..ఎవరి ఫాన్స్ వాళ్ళకుంటారు.
చిరంజీవి ఎంత ఎదిగినా తన స్టార్ హోదాని ఎక్కువగా ప్రదర్శించరు, అదే ఆయన సాధించిన వ్యకిగత విజయం. సినిమాల్లో ఉన్నపుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆవేశంతో రెచ్చిపోయేవాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక కొంచం ఆవేశం తగ్గించుకుని, జనాల్లోకి వెళ్తున్నప్పుడు కొంచం సహనం అలవాటు చేసుకున్నాడు. అన్నయ్య, తమ్ముడ్ని చూసి కొంచం కూడా నేర్చుకోని నాగబాబు, ట్విట్టర్లోనే ఉంటూ, ట్వీట్లతో అన్నగారి తరఫున పోరాటాలు చేస్తున్నాడు. అయినా నాగబాబు ట్వీట్ల వలన ఫాన్స్ ని రెచ్చగొట్టడం తప్ప ఎం ప్రయోజనం ? కొంతమంది అయితే నాగబాబు అతి గొప్పలకు పొతున్నాడని, కొంచం తగ్గి ఉంటె పోయేదేం లేదని అందరికి మంచిదని నాగబాబు ట్వీట్లకు సమాధానాలు ఇస్తున్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు ఎందుకు మెగా బ్రదర్ ?
Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…