
Congress Alliance Strategy in AP and TS
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మూడు పార్టీలు కలిసి ఉన్నంత కాలం సింగిల్గా సింహం గద్దె దించాలేదని స్పష్టమైంది.
కనుక సింహాలు దేనికవి సింగిల్గా పోరాడటం కంటే గుంపుగా పోరాడితే విజయం సాధించవచ్చని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో స్పష్టమైంది.
నాడు కురుక్షేత్ర మహా సంగ్రామంలో భీష్మాచార్యుడుని ఓడించడం అర్జునుడు వల్ల కానప్పుడు ఏం చేశాడో, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రధాని మోడీని ఓడించేందుకు అదే చేస్తోందనిపిస్తోంది.
సీపీఐని ముందుపెట్టి పోరాడితేనే దేశంలో బిజేపిని, ప్రధాని మోడీని వ్యతిరేకిస్తున్న శక్తులు, ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ బాగానే గ్రహించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో అలుపెరుగని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కూడా సీజేపీ ఆందోళనలకు సంఘీభావం తెలుపుతోంది.
కనుక అటువంటి శత్రు పార్టీలతో, అలాగే ఏపీలో వైసీపీ వంటి న్యూట్రల్ ప్రాంతీయ పార్టీలతో ఏదో విధంగా ప్యాచప్ చేసుకోగలిగితేనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం సాధ్యం.
గతంలో తెలంగాణ కోసం ఏపీ కాంగ్రెస్ను బలిచేసుకోవడానికి వెనుకాడని కాంగ్రెస్ అధిష్టానం, ఈసారి రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ను బలి చేసుకునేందుకు వెనుకాడకపోవచ్చు.
ఇక వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు పంతానికి పోయి ఎప్పటికీ ఒంటరి పోరాటాలు చేస్తూ అధికారానికి దూరంగా ఉండలేవు. కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన ఆఫర్ వస్తే దాంతో ప్రత్యక్షంగా లేదా రహస్యంగా చేతులు కలిపి లబ్ది పొందే ప్రయత్నం చేయకమానవు. ఎందుకంటే కాంగ్రెస్తో సహా ఏ పార్టీకైనా అధికారంలోకి రావడమే ముఖ్యం కదా?
ఇదివరకు తాను వైసీపీలో ఉన్నప్పుడు చాలా శ్రమించి టీడీపీ-బీజేపీ బంధాన్ని తెంచగలిగానని విజయసాయి రెడ్డి స్వయంగా ఇటీవలే బయటపెట్టారు. కానీ ఇప్పుడు వాటి బంధాన్ని తెంచగలిగేవారు లేరు.
కనుక ఏపీలో సింగిల్ సింహానికి కూడా ఓ తోడు చాలా అవసరం. లేకుంటే ఎప్పటికీ ప్రతిపక్ష నేత హోదా లేని నాయకుడుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక అయన కూడా కుదిరితే ఇండియా కూటమి సాయంతో రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకోవడం తప్పు, అసహజం కానే కాదు. అవునో కాదో రాబోయే రోజుల్లో క్రమంగా తేటతెల్లమవుతుంది.
ఇక తేలాల్సింది విజయసాయి రెడ్డి మొదలుపెట్టబోతున్న కొత్త కథే! ఆయన ఎవరు వదిలిన బాణమో?
YS Jagan Mohan Reddy’s latest statements have raised questions about his political consistency. The YSRCP…
ఇటీవల పుంగనూరులో నామినేషన్స్ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ మిథున్ రెడ్డి ఎంత హడావుడి చేశారో, ఎంత విధ్వంసం జరిగిందో అందరూ…