Telugu

రాజకీయాలకు, సినిమాలకు తేడా చూపించిన చిరంజీవి!

సినీ ఇండస్ట్రీలో ‘మెగాస్టార్’గా వెలుగొందిన చిరంజీవి, ఏదైనా ఒక మాట చెప్తే దానికి చాలా విలువ ఉండేది. అయితే ఇదంతా చిరు రాజకీయాల్లోకి రాక ముందువరకు మాత్రమే. ‘ప్రజారాజ్యం’ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరు ఏం చెప్పినా ప్రజలు పట్టించుకున్నది లేదు. దాని ఫలితాలు ఏమిటో నాటి సార్వత్రిక ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కేంద్రమంత్రి అయిన తర్వాత ప్రజల దృష్టిలో మరింతగా దిగజారిపోయి, ఒకప్పుడు ఏదైతే ప్రజల నుండి గౌరవం దక్కేదో, దానిని పోగొట్టుకున్నారు.

అయితే గత ఏడాది కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరం వహిస్తూ, సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి, మళ్ళీ తన మాటలకు విలువ తెచ్చుకునే పనులు చేస్తున్నారు. ఇటీవల చిరు హోస్ట్ చేస్తోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో సెలబ్రిటీ ఎపిసోడ్ లో వచ్చిన నాని, ‘మీరు నాకు ఒక సైకిల్ బాకీ ఉన్నారంటూ’ చమత్కరిస్తూ మాట్లాడారు. ‘మాస్టర్’ సినిమా సందర్భంగా టికెట్ కోసం వెళ్ళిన తనకు, తిరిగి వచ్చి చూసుకునే సరికి సైకిల్ పోయిందని, మీ సినిమాకు వెళితే పోయింది గనుక మీరు బాకీ ఉన్నట్లేనని హాస్యాస్పదం చేసారు.

ADVERTISEMENT

అయితే ఆ కార్యక్రమంలో నాని ప్రామిస్ చేస్తూ… ఖచ్చితంగా నీకు ఒక సైకిల్ కొనిస్తానని, నీకు కావాలంటే ‘మోటార్ సైకిల్’ అయినా కొనిస్తానని చెప్పారు. సహజంగా కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు గానీ, అవి అక్కడి వరకే పరిమితం అవుతాయని భావిస్తారు. కానీ, అందుకు విరుద్ధంగా నానికి ఓ సైకిల్ పంపించారు మెగాస్టార్. ఈ సందర్భంగా చిరు సైకిల్ తో ఫోటో దిగుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు నాని. షోలో హామీ ఇచ్చిన విధంగా తనకు సైకిల్ వచ్చిందని నాని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే రాజకీయాలలో చేసిన హామీలను నిలబెట్టుకోవడం గానీ, ప్రజా సంక్షేమం కొరకు గానీ, ఓ కేంద్రమంత్రిగా ఎలాంటి మంచి పనులు చేపట్టని చిరంజీవి, నాచురల్ స్టార్ నానికి వ్యక్తిగతంగా సైకిల్ కొనిపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ నిధులు ఉండి కూడా రాష్ట్రాభివృద్ధికి ఖర్చు పెట్టలేని చిరంజీవి, ఈ సైకిల్ ఎలా కొనుగోలు చేసారు? అన్న అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే రాజకీయ రంగంలో చిరు మాటలకు విలువ లేకపోయినా, సినీ ఇండస్ట్రీలో మాత్రం తన పట్టును కొనసాగించడానికో, ఏమో గానీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇద్దరి ప్రయత్నాలలో తేడా ఇదే!

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అధికార, అభివృద్ది వికేంద్రీకరణ కొరకు మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. అయితే దాని అసలు ఉద్దేశ్యం…

3 minutes ago

Rohit Was Ready to Quit? Big Retirement Twist Revealed!

Rohit Sharma’s future with Team India has once again become a major talking point as…

11 minutes ago