
ఈ కాంబినేషన్ ను సెట్ చేసింది పవన్ కల్యాణ్ అనేది అసలు హాట్ న్యూస్. ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసిన కొరటాల, సందేశంతో కూడిన ఒక కథను ఆయనకి వినిపించాడట. రాజకీయాలతో తాను బిజీగా ఉన్నాననీ, ఈ కథను అన్నయ్యతో చేస్తే బాగుంటుందని ఆయన దగ్గరికి కొరటాలను పవన్ పంపించాడట. ఆ కథను విన్న వెంటనే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట, అలా ఈ కాంబినేషన్ సెట్ అయింది.
బన్నీతో కొరటాల సినిమా వుండవచ్చని అందరూ అనుకుంటోన్న సమయంలో, ఏకంగా చిరంజీవితోనే కలిసి కొరటాల రంగంలోకి దిగుతుండటం విశేషం. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నాయో గానీ, సినీ జనాల్లో మాత్రం ఇది హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే మెగా ఫ్యాన్స్ కు పవర్ స్టార్ అతిపెద్ద ఫేవర్ చేరిన వారవుతారు.
Akshay Kumar and Priyadarshan are collaborating once again after Bhooth Bangla and Haiwaan. Although the…
Generally, the Supreme Court of India prefers to impose a complete ban on cracking of…