
అయితే చిరంజీవి వంటి హీరోలను దర్శకత్వం వహించే స్థాయి తనకు లేదని చెప్పిన రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి 2’ పనిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి, తన ‘బాహుబలి’ హీరో ప్రభాస్ తో కలిసి ‘ఖైదీ నంబర్ 150’ సెట్స్ లో దర్శనమిచ్చారు. కారణం ఉందో లేక క్యాజువల్ గా కలిసారో గానీ, ప్రభాస్ – చిరంజీవిలు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటుండగా, దానిని చూసి రాజమౌళి నవ్వుతూ మురిసిపోతున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను ‘ఖైదీ నంబర్ 150’ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా, అవి ప్రస్తుతం అభిమాన సందోహంలో హల్చల్ చేస్తున్నాయి. ఓ పక్కన ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ రికార్డులను ‘ఖైదీ నంబర్ 150’ దాటేసిందన్న ట్రేడ్ వర్గాల టాక్ తో, ‘బాహుబలి – ఖైదీ’ల కలయిక హాట్ టాపిక్ అయ్యింది.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ…
An early premiere can bring a film international attention even before its theatrical release. But…