
టాలీవుడ్ టాప్ హీరోల ‘హెయిర్ స్టైల్స్’ ప్రస్తావిస్తూ దక్కన్ క్రానికల్ ప్రచురించిన తాజా కధనం… అభిమానుల్లో కలవరం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కింగ్ నాగార్జున వంటి టాప్ హీరోలతో పాటు నటకిరీటీ రాజేంద్రప్రసాద్ హెయిర్ కు సంబంధించిన లోగుట్టు విషయాలను బయట ప్రపంచానికి చాటి చెప్పింది. సినిమాలలో మరియు అభిమానుల ముందుకు వచ్చేటపుడు చిరు ‘విగ్’ పెట్టుకుని వస్తారని, అదే రాజకీయ మీటింగ్స్ కు మాత్రం సహజంగా వచ్చేస్తారని తెలిపింది.
ఇక అందరూ నాచురల్ హెయిర్ గా భావించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయాన్ని ప్రస్తావిస్తూ… అది నాచురల్ హెయిర్ కాదని సంచలన విషయాన్ని తెలిపింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లలో పవన్ హెయిర్ స్టైల్ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని, అది సహజత్వంతో కూడుకున్నది కాదని ప్రచురించింది. అలాగే టాలీవుడ్ ‘మన్మధుడి’గా భావించే కింగ్ నాగార్జున కూడా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారని, నాగ్ ది కూడా నాచురల్ హెయిర్ కాదంటూ స్పష్టం చేసింది.
రాజేంద్ర ప్రసాద్ విషయం మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయమే కావడంతో నటకిరీటీ విషయం పెద్దగా షాక్ ఇవ్వలేదు. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా వెరైటీ విగ్గులు ధరిస్తారన్నది బహిర్గతమైన అంశమే కావడంతో ఇలాంటి విషయాలు షాక్ నివ్వలేదు గానీ, చిరు, పవన్, నాగ్ ల అంశం మాత్రం ఆయా హీరోల ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం. అయితే ఇలా చేయించుకోవడం అనేది తప్పు కాదు గానీ, ఇప్పటివరకు ఏ విషయంలో అయితే ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకున్నారో, అదే విషయంలో లోపం ఎత్తి చూపడమే రుచించని అంశం.
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు 'నిన్ను అసెంబ్లీ గేటు…
One of the crucial indicators of the potential lifetime performance of any film is based…