
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు ‘నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం’ అంటూ చేసిన సవాళ్లకు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా, ఐదు శాఖల మంత్రిగా ఎన్నికై గట్టి సమాధానమే చెప్పారు పవన్ కళ్యాణ్.
అలాగే పిఠాపురంలో పవన్ ఓటమి అంటూ శపధాలు చేసిన వైసీపీ కి కూడా నేడు పులివెందులలో జనసేన జెండాతో బదులు చెపుతున్నారు జనసైనికులు. పులివెందుల స్థానిక ఎన్నికల ఫలితాల వెలువడిలో ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది.
జగన్ సొంత ఇలాకా, వైఎస్ కుటుంబ కంచుకోట అయిన పులివెందుల 9 వ వార్డ్ లో జనసేన 877 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించింది. దీనితో పులివెందులలో తొలిసారిగా జనసేన జెండా ఎగిరిందనే చెప్పాలి.
అయితే రాజకీయంగా వార్డ్ విజయం అంత పెద్ద విషయం కాకపోయినప్పటికీ పులివెందులలో జగన్ ను కాదని వైసీపీ ని పక్కన పెట్టి రాజకీయంగా జగనే తన తొలి రాజకీయ ప్రత్యర్థి అన్నట్టుగా, జగన్ ఓటమికి, వైసీపీ పతననానికి శంఖం పూరించిన జనసేనకు పులివెందులలో వార్డు స్థాయి విజయమైన అది పెద్ద విషయమనే భావించాలి.
ఇక పులివెందుల 8 వ వార్డు లో టీడీపీ 644 ఓట్ల మెజారిటీతో, 10 వ వార్డ్ లో బీజేపీ 634 ఓట్ల ఆధిపత్యంతో ఉంటూ వైసీపీ ఏకచక్రాధిపత్యానికి బ్రేకులు వేశారు. ఇలా జగన్ చొక్కా మడతపెడతా అన్న చోటే వైసీపీ జెండా ను మడతపెట్టారు కూటమి పార్టీల నేతలు.
ఈ రోజు సాయంత్రానికి అసలు పులివెందులలో వైసీపీ బలం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారింది, టీడీపీ బలం ఎంత వృద్ధి చెందింది అనేది లెక్కలతో సహా తేలనుంది.
ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల తీర్పు మాత్రం కూటమికే అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని…
ఏపీ వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల సమరంలో రాజకీయాలకు అత్యంత కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ మేయర్ పీఠంపై తీవ్ర…