చిరంజీవి తో మురుగదాస్… నిజమెంత?

Chiranjeevi AR Murugadoss మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఇదే హాట్ టాపిక్. తదుపరి ఏంటి అనేదాని పై అందరి ఆసక్తి… భోళా కు ముందు సోగ్గాడే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ప్రసన్న కథతో చిరంజీవి కుమార్తె సొంత ప్రొడక్షన్ లో ఒక సినిమా ఒకే చేశారు. అయితే అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.

ఈ లోగా సోషల్ మీడియా లో ఒక పుకారు…. ఈ సినిమా కు కళ్యాణ్ కృష్ణ ను తప్పించి తమిళ దర్శకుడు మురుగదాస్ ని తీసుకుని వస్తున్నారని… మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో కొంత ఖుషి అయ్యారు.

ADVERTISEMENT

మురుగదాస్ ఈ మధ్య కాలంలో ఫామ్ లో లేనప్పటికీ బెటర్ ఛాయస్ కదా!

దీనిలో నిజమెంత అని M9.News Team చిత్ర బృందంలోని ఒక కీలకమైన వ్యక్తిని సంప్రదించింది.

“ఈ పుకారు ఎలా మొదలయ్యిందో తెలీదు. 2-3 రోజుల క్రితమే పెమెంట్స్ కూడా చేశారు కోర్ టీమ్ కు. ప్రస్తుతం దసపల్లా లో సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఒక వారంలో స్క్రిప్ట్ లాక్ చేస్తాం. మాది F2 లాంటి ఫన్ సినిమా… దానికి మురుగదాస్ గారేంటో?,” అన్నారు.

దానితో చిరంజీవి తో మురుగదాస్ సినిమా అనేది ఫ్యాన్స్ లో ఒక వర్గం తమని తాము సంతృప్తి పరుచుకోవడానికి సృష్టించిన పుకారు కావొచ్చు.
ఇక పోతే చిరంజీవికి చాలా కాలం నుండి వేధిస్తున్న మోకాలు సమస్య… భోళా టైం లో ఫారిన్ సాంగ్ షూట్ అప్పుడు తిరగబెట్టింది… దానికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారు. ఒక రెండు నెలలు ఆస్ట్రేలియా హాలిడే కి వెళ్లి రిలాక్స్ అవుతారని అంటున్నారు.

ఏది ఏమైనా చిరంజీవి కోలుకోగానే కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ADVERTISEMENT
Latest Stories