
అయితే చివరికి అటువంటిది ఏమీ జరగకపోవడంతో నిరాశ చెందారు. కానీ మనకు ఉన్న సమాచారం ప్రకారం ఆ రోజు ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చెయ్యాల్సింది కానీ చివరి నిముషంలో వాయిదా వేశారు. ఆచార్య లోగో తో ఒక పోస్టర్, చిరంజీవి స్టిల్ తో ఉన్న మరొక పోస్టర్ అప్పటికే సిద్ధం చేశారని సమాచారం.
“అదే రోజు, ఆర్ఆర్ఆర్ బృందం తమ టైటిల్ను ప్రకటించి మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. చిరంజీవి ఆర్ఆర్ఆర్పై అందరు పూర్తి దృష్టి పెట్టాలని కోరుకున్నారు, కాబట్టి ఆచార్య ఫస్ట్ లుక్ను మరో రోజు వాయిదా వేశారు,” అని బాగా తెలిసిన ఒకరు మనకు చెప్పారు. మొత్తానికి రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం చేసినట్టు అయ్యింది.
ఇది ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్, రెండు రోజుల తరువాత విడుదలైన రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకు సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ శరీర సౌష్టవం చూసి అందరు అబ్బురపడుతున్నారు. రామ్ చరణ్ కు వస్తున్న రెస్పాన్స్ తో చిరంజీవి ఆనందానికి అవధులు లేవని సమాచారం.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is…
The Andhra Pradesh State Election Commission (SEC) has rescheduled municipal elections in 99 urban local…